Viral Video : వావ్ షెఫాలీ... లేడి సెహ్వాగ్ గన్ లాంటి త్రో చూశారా..? అచ్చం జడేజాలానే..!

Photo Credit : Twitter

Viral Video : ఇక, ఈ మధ్య కాలంలో ఫీల్డింగ్ విషయంలో మెన్స్ క్రికెటర్లకు పోటీ నిస్తున్నారు మహిళా క్రికెటర్లు (Women Cricketers). అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతో.. తమ ఫిటెనెస్ లెవల్స్ ఏంటో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

  • Share this:
    క్రికెట్ (Cricket News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 (T-20 Format) వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. ఇక, ఈ మధ్య కాలంలో ఈ విషయంలో మెన్స్ క్రికెటర్లకు పోటీ నిస్తున్నారు మహిళా క్రికెటర్లు (Women Cricketers). అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతో.. తమ ఫిటెనెస్ లెవల్స్ ఏంటో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇక, లేటెస్ట్ గా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్నమహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (WBBL)లో టీమిండియా యువ సంచలనం షెఫాలీ వర్మ (Shafali Verma) కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో మైమరిపించింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే తన మార్క్ ఫీల్డింగ్‌తో సత్తా చాటింది. సిడ్నీ సిక్సర్స్‌ తరఫున బిగ్‌బాష్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన పెఫాలీ... బ్యాటింగ్‌లో మెరవకపోయినా.. ఫీల్డింగ్‌లో ఓ మెరుపు రనౌట్‌ చేసింది.

    డైరెక్ట్‌ త్రోతో ప్రత్యర్థి బ్యాటర్‌ను పెవిలియన్‌కు చేర్చింది. అచ్చం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తలపించింది. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్‌గా మారింది.షెఫాలీ సూపర్ ఫీల్డింగ్‌ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. 'వావ్‌, ఎక్స్‌లెంట్‌ ఫీల్డింగ్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు షెఫాలీని టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో పోలుస్తూ 'లేడీ జడేజా' అంటూ కొనియాడుతున్నారు.


    మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన సిడ్నీ సిక్సర్స్‌ టీమ్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఎల్లీస్సీ పేరీ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ ఐదో బంతికి మెల్‌బోర్న్‌ బ్యాటర్‌ ఎలీసీ విల్లాని షార్ట్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా షాట్‌ ఆడింది. అయితే, నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న సుదర్‌లాండ్ అనే మరో బ్యాటర్‌ క్రీజు వదిలి కాస్త ముందుకెళ్లింది. అప్పుడే షెఫాలి బంతి అందుకొని వికెట్లకేసి డైరెక్ట్‌ త్రో విసిరింది. దీంతో క్రీజు బయట ఉన్న సదర్ ల్యాండ్‌ (14) పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

    ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది.. ఒక క్యాచ్ ని ముగ్గురు పట్టారు..! కానీ, చివరికి కొంపముంచారుగా..

    షెఫాలీ రనౌట్ చూసి... కామేంటేటర్లు కూడా ఫిదా అయ్యారు. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఒక వికెట్‌ నష్టానికి 99 పరుగులు చేసింది. విల్లాని (54), లాన్నింగ్‌ (23) చివరివరకూ బ్యాటింగ్‌ చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం సిడ్నీ సిక్సర్స్‌ బ్యాటర్లు నాలుగు వికెట్లు కోల్పోయి 10.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఓపెనర్‌ అలిస్సా హేలీ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. షెఫాలి (8) పరుగులకే పెవిలియన్‌ చేరి బ్యాటింగ్‌లో నిరాశపరిచింది.
    Published by:Sridhar Reddy
    First published: