Home /News /sports /

WBBL ADELAIDE STRIKERS BRIDGET PATTERSON PULLED OFF AN EXTRAORDINARY CATCH AT THE BOUNDARY WATCH VIRAL VIDEO SRD

Viral Video: బాబోయ్ ఏంటా క్యాచ్..! సూపర్ మ్యాన్ కజిన్ సిస్టర్ లా ఉందిగా..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : ఇక, ఈ మధ్య కాలంలో ఫీల్డింగ్ విషయంలో మెన్స్ క్రికెటర్లకు పోటీ నిస్తున్నారు మహిళా క్రికెటర్లు (Women Cricketers). అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతో.. తమ ఫిటెనెస్ లెవల్స్ ఏంటో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

    క్రికెట్ (Cricket News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 (T-20 Format) వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. ఇక, ఈ మధ్య కాలంలో ఈ విషయంలో మెన్స్ క్రికెటర్లకు పోటీ నిస్తున్నారు మహిళా క్రికెటర్లు (Women Cricketers). అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతో.. తమ ఫిటెనెస్ లెవల్స్ ఏంటో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇక, లేటెస్ట్ గా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్నమహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (WBBL)లో అలాంటి ఓ అద్భుత క్యాచే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

    ఎందుకంటే ఆ ఫీల్డర్‌ బౌండరీ లైన్‌పై గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకుంది. అయితే ఆ తర్వాత బాలెన్స్‌ కోల్పోయింది. దీంతో బౌండరీ లైన్‌ దగ్గర మునివేళ్లపై నిల్చొని బంతిని మళ్లీ గాల్లోకి విసిరింది. ఆపై ఆమె బౌండరీ దాటి తిరిగి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి బంతిని ఒడిసిపట్టింది. తొలుత బంతి అందుకున్నప్పుడు ఆమె రెండు పాదాలు నేలకు ఆనించిన సమయంలో బౌండరీ లైన్‌కి టచ్‌ కాకుండా అతికష్టం మీద తన శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకొని వావ్‌ అనిపించే క్యాచ్‌ అందుకుంది. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ లో పంచుకుంది.

    బిగ్‌బాష్‌ లీగ్‌లో శనివారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సూపర్ ఫీల్డింగ్ విన్యాసం నమోదైంది. సిడ్నీ ఛేజింగ్ లో 19వ ఓవర్‌లో ఇసాబెల్లె వాంగ్‌ (6) బ్యాటింగ్‌ చేస్తుండగా నాలుగో బంతిని డీప్‌మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదాలని చూసింది.

    ఇది కూడా చదవండి : టీ 20 వరల్డ్ కప్ లో వేరే దేశానికి ఆడుతున్న హైదరాబాద్ కుర్రాడు..! ఆ జట్టుకు మనోడే కీలకం..

    దీంతో బంతి అమాంతం బౌండరీ లైన్‌ దాటిపోయేలా కనిపించింది. సరిగ్గా అప్పుడే అడిలైడ్‌ ఫీల్డర్‌ బ్రిడ్జెట్‌ పాటర్సన్‌ గాల్లోకి ఎగిరి తనని తాను బ్యాలెన్స్‌ చేసుకొని నమ్మశక్యం కాని క్యాచ్‌ అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, ఈ మ్యాచ్ లో అడిలైట్ టీమ్ 30 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.


    ఇక, బ్రిడ్జెట్ క్యాచ్ పై క్రికెట్ ప్రపంచం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి విన్యాసాలు పురుషుల క్రికెట్ లోనే చూస్తామనుకంటే పొరపాటే.. మహిళలు వాళ్లని మించి ఫీల్డింగ్ చేయగలరంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, మహిళా క్రికెట్ లో ఇది వన్ ఆఫ్ ది క్యాచ్ అని పలువురు మాజీ క్రికెటర్లు బ్రిడ్జెట్ పాటర్సన్ ను ప్రశంసిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Cricket, Viral Video, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు