Washington Sundar : మొన్నటి వరకు టీమిండియా (Team India)లో రెగ్యులర్ ప్లేయర్ గా ఉన్న ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) వరుస గాయాలతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున బరిలోకి దిగినా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. ఇక అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఎంపిక కావడం లేదు. దాంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని నిర్ణయించుకున్న అతడు.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న కౌంటీలో ఆడేందుకు అక్కడికి వెళ్లాడు. లంకాషైర్ జట్టుతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 1లో ఆడుతూ బిజీగా ఉన్నాడు.
ఇటీవలే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సుందర్ తాజాగా కెంట్‌తో మ్యాచ్‌లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. సుందర్ వేసిన బంతి గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లింది. అయితే బంతిని డిఫెన్స్ చేద్దామని ప్రయత్నించిన కెంట్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ విఫలమయ్యాడు. బంతి ప్యాడ్ల సందులో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. అంతే ఏం జరిగిందో అర్థం కాని జోర్డాన్ కాక్స్ నోరెళ్ల బెట్టి అలా చూస్తూనే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను కౌంటీ చాంపియన్‌షిప్ షేర్ చేస్తూ.. ''సుందర్ నుంచి అద్భుతమైన డెలివరీ.... సూపర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
That is an incredible delivery from @Sundarwashi5 ????#LVCountyChamp pic.twitter.com/rLyMvMmI9l
— LV= Insurance County Championship (@CountyChamp) July 28, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 182 పరుగుల తేడాతో కెంట్‌పై ఘనవిజయం సాధించింది. లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 145 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెంట్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌట్ అయి 125 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం లంకాషైర్ అద్బుత ఆటతీరు కనబరిచింది. 9 వికెట్ల నష్టానికి 436 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెంట్ అనూహ్యంగా 127 పరుగులకే కుప్పకూలింది. టామ్ బెయిలీ 5 వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, England, Hardik Pandya, India vs australia, India Vs Westindies, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli