Home /News /sports /

WATCH SOURAV GANGULY DANCE WITH HIS DAUGHTER SANA AT LONDON STREETS ON HIS 50TH BIRTH DAY SJN

Sourav Ganguly : వామ్మో గంగూలీ.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. బర్త్ డే నైట్ కూతురుతో కలిసి ఏం చేశాడంటే?

PC : TWITTER

PC : TWITTER

Sourav Ganguly : ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఈసారి తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. జూలై 8వ తేదీన లండన్ (London)లో గంగూలీ తన బర్త్ డేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...
Sourav Ganguly : ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఈసారి తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. జూలై 8వ తేదీన లండన్ (London)లో గంగూలీ తన బర్త్ డేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒకరోజు ముందుగానే సహచర ప్లేయర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), బీసీసీఐ కార్యదర్శి జై షా, రాజీవ్ శుక్లాలకు పుట్టిన రోజు పార్టీ ఇచ్చిన గంగూలీ.. ఆ రోజు రాత్రి భార్య డోనా, కూతురు సనాలతో కలిసి లండన్ వీధుల్లో డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బాలీవుడ్ హీరో నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని సాంగ్ కు భార్య డోనా, కూతురు సనాలతో కలిసి సౌరవ్ గంగూలీ స్టెప్పులేశాడు. కూతురు సనా డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడ్డా.. గంగూలీ మాత్రం ఎటువంటి బెరుకు లేకుండా అదిరిపోయే స్టెప్పులేశాడు. ఎంతో అనుభవం ఉన్న డ్యాన్సర్ లా గంగూలీ డ్యాన్స్ చేయడం విశేషం. ఇక ఈ వీడియోను చూసిన అతడి అభిమానులు ’లండన్ వీధుల్లో దాదాగిరి మామూలుగా ఉండదు మరీ‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో పాటు ’నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా బాసూ‘ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.





సౌరవ్ గంగూలీ.. ప్రత్యర్థి కవ్విస్తున్నా మనకెందుకులే అన్నట్లు సాగుతోన్న టీమిండియా ప్లేయర్లకు దూకుడును పరిచయం చేసిన కెప్టెన్. మాటకు ఆటతోనే కాదు మాటకు మాటతోనే బదలు చెప్పాలని గట్టిగా నమ్మినవాడు. పరిస్థితులు ఎలా ఉన్నా చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో టీమిండియా రూపు రేఖలనే మార్చిన ఘనుడు సౌరవ్ గంగూలీ. సచిన్ టెండూల్కర్ సునీల్ గావస్కర్ మాదిరి భారీ రికార్డులు సాధించకపోయినా.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలా ప్రపంచకప్ లు అందించకపోయినా.. టీమిండియాపై గంగూలీ తనదైన ముద్రను వేశాడు. ఫిక్సింగ్ వార్తలతో టీమిండియా పరువు పోయిన వేళ.. కెప్టెన్సీ తన వల్ల కాదంటూ సచిన్ లాంటి దిగ్గజం వెనక్కి తగ్గిన వేళ.. నేనున్నానంటూ గంగూలీ 2000వ సంవత్సరంలో ముళ్ల కిరీటాన్ని అందుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Dinesh Karthik, Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Sourav Ganguly, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు