IND vs NZ 5th T20 : సంజు శాంసన్‌ అదిరే స్టంట్... సోషల్ మీడియాలో వైరల్

India vs New Zealand 5th T20 : క్రికెట్‌లో ప్రతీ పరుగూ కీలకమే. ప్రతీ రన్నూ జయాపజయాల్ని నిర్ధారించేదే. అందువల్ల సంజు శాంసన్ చేసిన సూపర్ ఫీట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

news18-telugu
Updated: February 3, 2020, 12:42 PM IST
IND vs NZ 5th T20 : సంజు శాంసన్‌ అదిరే స్టంట్... సోషల్ మీడియాలో వైరల్
IND vs NZ 5th T20 : సంజు శాంసన్‌ అదిరే స్టంట్... సోషల్ మీడియాలో వైరల్ (credit - twitter - Nishant Barai)
  • Share this:
India vs New Zealand 5th T20 : న్యూజిలాండ్‌తో జరిగిన 4 టీ20లు ఒక లెక్క. ఆదివారం జరిగిన ఐదో చివరి టీ20 మరో లెక్క. ఆ మ్యాచ్ గెలవడం ద్వారా... టీమిండియా... సిరీస్ క్లీన్ స్వీప్ చేసి... అలా చేసిన మొదటి టీమ్‌గా చరిత్ర సృష్టించింది. అందువల్ల ఐదో మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ ఫీల్డింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా... ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 8వ ఓవర్‌ చివరి బంతికి కివీస్‌ బ్యాట్స్‌మేన్‌ రాస్‌ టేలర్‌ షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో ఆడిన భారీ షాట్‌ విషయంలో సంజు శాంసన్ చేసిన ఫీట్ అందరి చేతా వావ్ అనిపిస్తోంది. నిజానికి అది సిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ శాంసన్‌ పరిగెత్తుకొంటూ బౌండరీ లైన్‌ అవతలకు డైవ్‌ చేస్తూ బంతిని పట్టుకున్నాడు. ఆ క్రమంలో తాను కింద పడతానని గ్రహించి... గాల్లో ఉన్నప్పుడే ఆ క్షణంలోనే బంతిని గ్రౌండ్‌లోకి విసిరేశాడు. ఫలితంగా ఆరు పరుగులు దక్కుతాయనుకున్న కివీస్‌కి రెండు రన్సే దక్కాయి. ఇలా కివీస్ ఓటమిలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించినట్లైంది. ప్రస్తుతం సంజు చేసిన ఫీట్... సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.


ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన 5 టీ20 మ్యాచుల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 5వ టీ20లో కూడా టీమిండియా చేతిలో కివీస్ ఓటమి పాలవడంతో 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 164 పరుగులను ఛేదించడంలో కివీస్ సేన తడబడింది. చివరి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 5వ వన్డేలో భారత్ ప్రయోగాలకు చోటిచ్చింది. ఇందులో భాగంగా కేఎల్‌ రాహుల్‌, శాంసన్‌లు ఓపెనర్లుగా వచ్చారు. అయితే శాంసన్‌ ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని ఔట్ అయ్యాడు. దీంతో 8 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు జత కలిసిన రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేఎల్‌ రాహుల్‌(45), రోహిత్‌ శర్మ(60) జోరుగా ఆడటంతో భారీ స్కోరు దిశగా స్కోరుబోర్డు కదిలింది. ఫలితంగా జట్టు స్కోరు 96 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రోహిత్‌ శర్మ-అయ్యర్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించారు. రోహిత్‌ శర్మ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, రోహిత్‌ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాడు. కాలి కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌ చేరాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన దూబే(5) నిరాశపరిచాడు. చివర్లో మనీష్‌ పాండే(11 నాటౌట్‌: 4 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌) 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో కుగ్‌లీన​రెండు వికెట్లు సాధించగా, బెన్నెట్‌కు వికెట్‌ లభించింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బుమ్రా, 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' రాహుల్‌ దక్కించుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం కివీస్‌తో టీమిండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ ఆడబోతోంది. ఇందులోనూ సత్తా చాటి... కివీస్‌లో కాన్ఫిడెన్స్ ఏమాత్రం లేకుండా చెయ్యాలని టీమిండియా ప్రయత్నిస్తోంది.First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు