WATCH ROHIT SHARMA DAUGHTER SAMAIRA SHARMA GIVES UPDATE ON HIS HEALTH VIDEO VIRAL SJN
Rohit Sharma Daughter : రోహిత్ శర్మ కూతురిని చూశారా.. చూడండి తండ్రి ఆరోగ్యం గురించి ముద్దు ముద్దుగా ఎలా చెబుతుందో (వీడియో)
PC : TWITTER
Rohit Sharma Daughter : ఇంగ్లండ్ (England) పర్యటనలో ఉన్న టీమిండియా (Team India) సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. లీసెస్టర్ షైర్ తో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడుతూ రోహిత్ కరోనా బారిన పడ్డాడు.
Rohit Sharma Daughter : ఇంగ్లండ్ (England) పర్యటనలో ఉన్న టీమిండియా (Team India) సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. లీసెస్టర్ షైర్ తో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడుతూ రోహిత్ కరోనా బారిన పడ్డాడు. వెంటనే అతడిని హోటల్ లోని ఒక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోహిత్ తో పాటు ఇంగ్లండ్ కు వెళ్లిన అతడి భార్య రితిక.. కూతుర సమైర శర్మలకు మాత్రం కోవిడ్ నెగెటివ్ అని తేలింది. తాజాగా తండ్రి ఆరోగ్యం గురించి కూతురు సమైర శర్మ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హోటల్ గది నుంచి తల్లి రితికతో పాటు సమైరా శర్మ బయటకు రాగా.. అక్కడే ఉన్న ఒక వ్యక్తి హాయ్ అంటూ సమైరా శర్మను పలకరిస్తాడు. సమైరా కూడా హాయ్ అంటూ బదులిస్తుంది. నాన్న ఎలా ఉన్నాడంటూ సమైరాను ఆడగ్గా.. నాన్న రూమ్ లో ఉన్నాడని.. కరోనా పాజిటివ్ గా తేలాడని తనకు తెలిసినవి చెబుతుంది. అంతేకాకుండా నెల రోజుల వరకు బయటకు వచ్చేది లేదని ముద్దు ముద్దుగా చెబుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
— Krishna sai ✊???????? (@Krishna19348905) June 27, 2022
ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న రోహిత్ తన అభిమానుల కోసం ఒక ఫోటోను ఒకటి షేర్ చేశాడు. ఈ ఫోటోను చూస్తుంటూ రోహిత్ ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రోహిత్ కు పెద్దగా కరోనా లక్షణాలు లేనట్లు అనిపిస్తోంది. అయితే ఇంగ్లండ్ తో జరిగే టెస్టు మ్యాచ్ నాటికి రోహిత్ అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి. మ్యాచ్ నాటికి రోహిత్ కరోనా నెగెటివ్ గా తేలినా అతడు మ్యాచ్ ఫిట్ నెస్ తో ఉండేది అనుమానమే. మ్యాచ్ ఫిట్ నెస్ లేకపోయినా అతడిని ఆడిస్తే అది మొదటికే మోసం వస్తుంది. దాంతో టెస్టు మ్యాచ్ లో రోహిత్ కు రెస్ట్ ఇస్తేనే మంచిది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.