The Great Khali : దిలీప్ సింగ్ రాణా (Dalip Singh Rana).. అంటే చాలా మందికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అదే ’ది గ్రేట్ ఖలీ (The Great Khali)‘ అంటే మాత్రం భారత్ లో దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. విఖ్యాత డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)లో 2010లో ది గ్రేట్ ఖలీ అనే రింగ్ పేరుతో దిలీస్ సింగ్ రాణా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అందరూ అతడిని ’ది గ్రేట్ ఖలీ‘గానే గుర్తుపెట్టుకున్నారు. అయితే డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్ బై చెప్పిన తర్వాత భారత్ కు తిరిగొచ్చిన ఖలీ.. దేశంలో రెజ్లింగ్ ను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో పలు సినిమాల్లో నటిస్తున్నాడు కూడా. ఖలీ ఎత్తు దాదాపు 7.1 అడుగులు. బరువు 157 కేజీలు. చూస్తేనే భయపెట్టేలా ఖలీ కనిపిస్తాడు.
ఇది కూడా చదవండి : అక్కడ శ్రీలంక గెలిస్తే.. ఇక్కడ భారత్ పడిపోయింది.. ఇక ఈసారి కష్టమే!
అటువంటి ఖలీకి ఒకరు ధమ్కీ ఇచ్చాడు. అంతేకాదు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాలను ఖలీనే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా బయటపెట్టాడు. సోమవారం రోజు ఖలీ హరియాణాలోని కర్నల్ ప్రాంతానికి వెళ్లే సమయంలో ఫిలౌర్ టోల్ గేట్ కు చెందిన ఒక ఉద్యోగి ఖలీతో దురుసుగా ప్రయత్నించాడు. సెల్ఫీ కావాలంటూ తన కారును ఆపాడని ఖలీ పేర్కొన్నాడు.
View this post on Instagram
Viral Video of Argument between WWE Superstar 'The Great #Khali' and Toll workers, Somewhere In Punjab. pic.twitter.com/MsCdPslcLs
— Nikhil Choudhary (@NikhilCh_) July 11, 2022
అతడితో సెల్ఫీ దిగేందుకు ఖలీ ఒప్పుకోకపోవడంతో ఆ ఉద్యోగి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని తెలిపాడు. అంతటితో ఊరుకోక అసభ్యపదజాలాన్ని కూడా వాడినట్లు ఖలీ పేర్కొన్నాడు. అయితే తాను సంయమనంతో వ్యవహరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఖలీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నాడు. ఇక దీనిపై అతడి అభిమానులు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరేమో ఖలీ నీ ముందు అతడెంత ఒక్కటిచ్చి ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో ’నువ్వు మంచి పని చేశావ్‘ అంటూ ఖలీని అభినందించారు.
ఇక ఖలీ 2010లో డబ్ల్యూడబ్ల్యూఈలో అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజ రెజ్లర్లు అయిన అండర్ టేకర్, బటిస్టా, రేమిస్టిరియో, జాన్ సీనాలతో పోటీ పడ్డాడు. అయితే డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నంత కాలం ఖలీ హీల్ (చెడ్డవాడిలా) పాత్రపే పోషించాల్సి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చిన అతడు ఈ మధ్య కాలంలో భారత సంతతికి చెందిన కెనడా రెజ్లర్ జిందర్ మహాల్ తో కలిసి డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించాడు. అయితే ఈ సారి పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో అతడు తిరిగి భారత్ వచ్చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana, India, India vs england, Toll plaza, Wrestling, Wwe