Kerala Boy Goal : వావ్... వాటే గోల్... అదరగొట్టిన కేరళ చిన్నారి

Kerala Boy Goal : క్రికెట్‌ని ఎంతగానో అభిమానించేవారు సైతం... ఫుట్‌బాల్ అంటే కూడా ఎంతగానో ఇష్టపడతారు. కారణం గోలే. కేరళలో ఆ చిన్నారి కొట్టిన గోల్ అందరిచేతా శభాష్ అనిపిస్తోంది.


Updated: February 15, 2020, 8:00 AM IST
Kerala Boy Goal : వావ్... వాటే గోల్... అదరగొట్టిన కేరళ చిన్నారి
Kerala Boy Goal : వావ్... వాటే గోల్... అదరగొట్టిన కేరళ చిన్నారి (credit - twitter - I M Vijayan)
  • Share this:
Kerala Boy Near Impossible Goal : గోల్ రాబట్టాలంటే... గోల్ కీపర్‌ని దాటి బాల్... నెట్‌లోకి వెళ్లాలి. అది చాలా కష్టం. ఒక్క కిక్కు తోనే గోల్ రావాలంటే ఇంకా కష్టం. అలాంటి అరుదైన ఫీట్‌ని సుసాధ్యం చేశాడు కేరళకు చెందిన 10 ఏళ్ల పిల్లాడు. ఒకే ఒక్క కిక్కు కొట్టి... బంతి గాల్లోనే వంకరగా ఎగిరేలా చేసి... గోల్ కీపర్‌కి బాల్ ఏమాత్రం టచ్ అవ్వకుండా చేసి... డైరెక్టుగా నెట్‌లోకి దూసుకెళ్లేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో దీన్ని ఒకటికి రెండుసార్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు సాకర్ అభిమానులు. ఈ వీడియోని ఆ పిల్లాడి తల్లి ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యింది. ఆ తర్వాత మాజీ లెజెండరీ స్ట్రైకర్ IM విజయన్... దీన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సూపర్స్ అనే కాప్షన్ పెట్టారు. ఇప్పటి వరకూ ఈ వీడియోకి 14వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1800 మంది లైక్ చేశారు. 436 మంది కామెంట్స్ పెట్టారు. 300 మందికి పైగా రీట్వీట్ చేశారు.





పదేళ్ల పిల్లాడు కొట్టిన కిక్... ఇంటర్నెట్ యూజర్లకు కిక్ ఇస్తోంది. మామూలుగా క్రికెట్ కారణంగా భారతీయులు ఫుట్‌బాల్‌పై ఎక్కువ ఆసక్తి చూపరు. కానీ ఇలాంటి సీన్లు చూస్తే మాత్రం క్రికెట్ కంటే... సాకరే నచ్చే అవకాశాలు ఎక్కువ అని ఓ ట్విట్టర్ యూజర్ తన అభిప్రాయం తెలిపారు.

నైస్ కిడ్... విత్ ఏ క్లాసిక్ కిక్ అంటూ మరో యూజర్ ఈ చిన్నారిని పొగుడుతూ... ఇండియా ఫ్యూచర్ ఛాంపియన్స్ అని మెచ్చుకున్నాడు. సెకండ్ కంటే తక్కువ సమయంలో... జీరో డిగ్రీ డైమెన్షన్ నుంచీ... డైరెక్టుగా బంతిని గోల్ పోస్టులో వెయ్యడాన్ని మరో యూజర్ మెచ్చుకున్నారు. మరో యూజరైతే... వాటే ప్లేయర్... టూ గుడ్... వావ్... సింప్లీ అవుట్‌స్టాండింగ్... హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అని దీవించారు. ఫిబ్రవరి 9న ఆల్ కేరళ కిడ్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ గోల్ కారణంగా... ఈ చిన్నారి ఉన్న టీమ్... హ్యాట్రిక్ స్కోర్ సాధించింది.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు