Home /News /sports /

WATCH BALL OF THE CENTURY IN WOMEN CRICKET AS SHIKHA PANDEY COMPLETELY STUNS AUSTRALIAN HEALY CHECK VIDEO JNK

Shikha Pandey: ఉమెన్ క్రికెట్‌లో శిఖా పాండే సంచలన బౌలింగ్.. బాల్ ఆఫ్ ది సెంచరీగా కీర్తించబడుతున్న ఆ వీడియో చూశారా?

భారత మహిళా క్రికెట్ జట్టు పేసర్ శిఖా పాండే వేసిన అద్బుతమైన బంతిని చూశారా? (PC: BCCI)

భారత మహిళా క్రికెట్ జట్టు పేసర్ శిఖా పాండే వేసిన అద్బుతమైన బంతిని చూశారా? (PC: BCCI)

Shikha Pandey: టీమ్ ఇండియా మహిళా పేసర్ శిఖా పాండే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అద్బుతమైన స్వింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ అలీసా హేలీని క్లీన్ బౌల్డ్ చేసింది. ఇప్పుడు దీన్ని బాల్ ఆఫ్ ది సెంచరీ అని మాజీ క్రికెటర్లు అభివర్ణిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    మహిళా క్రికెట్ (Women Cricket) అంటే ఇప్పటికీ చాలా మందికి చులకన భావం. అదేదో గల్లీ క్రికెట్ లాగ భావించే వాళ్లు ఉంటారు. కానీ గత కొన్నేళ్లలో మహిళా క్రికెట్ ఎంత అభివృద్ది చెందిందో చెప్పలేము. పురుష క్రికెట్‌తో సమానమైన స్టాండర్డ్స్‌ను మెయింటైన్ చేయడానికి చాలా మంది మహిళా క్రికెటర్లు కృషి చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పురుషులకు ఏ మాత్రం తీసిపోమ్మని నిరూపిస్తున్నారు. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు (Team India Women) మీడియం పేసర్ శిఖా పాండే (Shikha Pandey) సంచలన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను నివ్వెరపరిచింది. శనివారం ఆస్ట్రేలియాతో (Australia Women) జరిగిన రెండవ టీ20 (T20 Match) మ్యాచ్‌లో వేసిన బంతి అద్భుతమైన స్వింగ్‌తో అలీసా హేలీని క్లీన్ బౌల్డ్ చేసింది. బంతి ఏకంగా 6 స్టంప్‌ల దూరం స్వింగ్ అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శిఖా పాండే తొలి ఓవర్ రెండో బంతికే అలీసా హేలీని క్లీన్ బౌల్డ్ చేసింది. ఆమె వేసిన బంతిని చూసి హేలీ నోట మాట రాలేదు.

    శిఖా వేసిన బంతి దాదాపు 6 నుంచి 8 స్టంప్‌ల దూరం స్వింగ్ అయ్యింది. వైడ్ వెళ్తుందని హేలీ బంతిని వదిలేసినా అది అనూహ్యంగా స్వింగ్ అయి వికెట్లను గిరాటేయడం గమనార్హం. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. మహిళా క్రికెట్‌లో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' (Ball Of the Century) గా ఆయన అభివర్ణించాడు. 'ఈ బంతి కచ్చితంగా మహిళా క్రికెట్‌లో బాల్ ఆఫ్ ది సెంచరీ.. టేక్ ఏ బౌ శిఖా పాండే' అని వసీమ్ జాఫర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో వైరల్‌గా మారింది. ఆ బంతి చూసి ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతలా ఎలా స్వింగ్ చేయగలిగిందని ముక్కున వేలేసుకుంటున్నారు.

    Team India Coach: టీమ్ ఇండియాకు కోచ్‌గా రావాలనుకుంటున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. గతంలో మంచి రికార్డు









    ఇక పురుషుల క్రికెట్‌లో బాల్ ఆఫ్ ది సెంచరీ 1993లో నమోదయ్యింది. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్వార్న్ వేసిన ఒక బంతి ఇంగ్లాండ్ క్రికెటర్ మైక్ గాటింగ్‌ను బోల్తా కొట్టించింది. మాంచెస్టర్‌లో జరిగిన ఒక టెస్టులో ఈ అద్భుతం జరిగింది. పిచ్‌పై ఉన్న చిన్న చిన్న క్రాక్స్‌ను ఉపయోగించుకొని వార్న్ ఈ బంతి విసిరాడు. పూర్తిగా లెగ్‌సైడ్ బంతిని విసరగా.. అది వెనక్కు వెళ్లిపోతుందని గాటింగ్ భావించాడు. కానీ ఆ బంతి అనూహ్యంగా స్పిన్ అయ్యి.. లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. మైక్ గాటింగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన జీవితంలో అలాంటి బంతిని చూడలేదన్నాడు. ఆ తర్వాత 'బాల్ ఆఫ్ ది సెంచరీ'గా నమోదయ్యింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Team india, Women's Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు