కోహ్లీ కెరీర్ ముగిసే నాటికి 75-80 సెంచరీలు బాదుతాడు...మాజీ క్రికెటర్ జోస్యం...

కోహ్లీ తన కెరీర్ ముగిసేలోగా కనీసం 75-80 సెంచరీలు నమోదు చేసే అవకాశం ఉందన్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో రెండో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్ మెన్ గా పేరుకెక్కాడు.

news18-telugu
Updated: August 13, 2019, 4:03 PM IST
కోహ్లీ కెరీర్ ముగిసే నాటికి 75-80 సెంచరీలు బాదుతాడు...మాజీ క్రికెటర్ జోస్యం...
విరాట్ కోహ్లీ (ఫైల్ చిత్రం)
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ ముగిసేలోగా 75-80 సెంచరీలు కొట్టే చాన్స్ ఉందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. వెస్టిండీస్ పర్యటలో భాగంగా రెండో వన్డేలో కోహ్లీ 120 పరుగులు చేసి 42వ సెంచరీ నమోదు చేసాడు. అయితే కోహ్లీ సెంచరీపై వసీమ్ జాఫర్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కోహ్లీ తన కెరీర్ ముగిసేలోగా కనీసం 75-80 సెంచరీలు నమోదు చేసే అవకాశం ఉందన్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో రెండో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్ మెన్ గా పేరుకెక్కాడు. ప్రస్తుతం కోహ్లీ 11406 పరుగులు చేసి రెండో స్థానంలో నిలవగా, సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు.

Published by: Krishna Adithya
First published: August 13, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading