Home /News /sports /

WASIM JAFFER COMPARES HARDIK PANDYA RISHABH PANT BATTING WITH RAM CHARAN JR NTR NATU NATU SONG MOVES SJN

Team india : హార్దిక్, పంత్ లను రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పోలుస్తూ వసీం జాఫర్ ట్వీట్.. వైరల్ చేస్తున్న అభిమానులు

PC : TWITTER

PC : TWITTER

Hardik Pandya - Rishabh Pant : ఇంగ్లండ్ (England) పర్యటనను రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని టీమిండియా (Team india) విజయంతో ముగించింది. సిరీస్ ను తేల్చే చివరిదైన మూడో వన్డేలో రిషభ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇంకా చదవండి ...
Hardik Pandya - Rishabh Pant : ఇంగ్లండ్ (England) పర్యటనను రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని టీమిండియా (Team india) విజయంతో ముగించింది. సిరీస్ ను తేల్చే చివరిదైన మూడో వన్డేలో రిషభ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు. పంత్ కు తోడు హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) అర్ధ శతకంతో చెలరేగాడు. ఫలితంగా 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 261 పరుగులు చేసి గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. టెస్టు మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత్ అటు టి20, ఇటు వన్డే సిరీస్ లను సొంతం చేసుకుని ఇంగ్లండ్ పర్యటనను ముగించింది.

ఇది కూడా చదవండి : లండన్ వీధుల్లో ధోనిని పరుగెత్తించిన ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే?

తాజాగా భారత మాజీ టెస్టు ప్లేయర్ వసీం జాఫర్.. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ లను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పోలుస్తూ ట్వీట్ చేశాడు. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ మూవ్స్ ను ట్వీట్ లో జత చేశాడు జాఫర్. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో పంత్, హార్దిక్ జత కలిశారని. ఆ సమయంలో వీరు ఏ మాత్రం భయపడకుండా.. నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మాదిరి చెలరేగిపోయారనే అర్థం వచ్చేలా జాఫర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు ఫ్యాన్స్ మరికొన్ని RRR సినిమాలోని కొన్ని సీన్స్ తో వీరి బ్యాటింగ్ ను పోలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.





ఇక మ్యాచ్ విషయానికి వస్తే 260 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (17), విరాట్ కోహ్లీ (17), సూర్యకుమార్ యాదవ్ (16) వెంట వెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. దాంతో భారత్ 72 పరుగులకే నాలుగువికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ తో కలిసి పంత్ జట్టును ముందుకు నడిపాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో బట్లర్ స్టంపింగ్ చాన్స్ ను మిస్ చేయడంతో బతికి బయటపడిన పంత్.. ఆ తర్వాత అద్బుత షాట్లతో అలరించాడు. మరో ఎండ్ లో ఉన్న హార్దిక్ టి20 తరహా బ్యాటింగ్ చేశాడు. వీరు ఐదో వికెట్ కు 123 పరుగులు జోడించారు. చివర్లో హార్దిక్ అవుటవ్వగా.. జడేజా (7 నాటౌట్)తో కలిసి మ్యాచ్ ను ముగించేశాడు పంత్. ఈ క్రమంలో పంత్ వన్డేల్లో తొలి సెంచరీని అందుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, Jr ntr, Mohammed Siraj, Ram Charan, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, RRR, Team India, Virat kohli

తదుపరి వార్తలు