ఇంగ్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్‌లో జరగబోయే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సీరిస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు పృథ్వీ షా, కుల్దీప్, భువనేశ్వర్‌లను చోటు దక్కకపోవడం అందర్ని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పృథ్వీ షాకు తుది జట్టులో లేకపోవడం కొంత అయోమయానికి గురి చేసింది. గత ఆసీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన పృథ్వీ షా ఆ తర్వాత విజయ్ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. ఆ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించాడు. మెుత్తం 800 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్లోనూ తన తడాకను చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్‌లు ఆడి 308 పరుగులు చేశాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించి సత్తా చాటాడు.
అలాంటి పృథ్వీ షాను ఎంపిక చేయకపోవడం అందర్ని ఆశ్చర్యపరిచింది. అతనికి జట్టులో చోటుదక్కకపోవడానికి కారణం ఎక్కువ బరువే కారణమని తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. పృథ్వీ షా కాస్త వెయిట్ తగ్గాలని.. దానికి రిషబ్ పంత్‌ను ఉదాహరణగా తీసుకోవాలని బీసీసీఐ సూచించిందని సమాచారం. 21 ఏళ్ల పృథ్వీ ఆసీస్ పర్యటనలో ఫీల్డింగ్‌లో వెనుకబడ్డాడు. పలు క్యాచ్‌లు కూడా వదిలేశాడు. దీనికి అతని బరువే కారణమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Green india challenge, Prithvi shaw