Home /News /sports /

WARM WELCOME TO PV SINDHU AND HER COACH IN DELHI INTERNATIONAL AIRPORT PV SINDHU TO MEET PM MODI JNK

PV Sindhu: పీవీ సింధు, ఆమె కోచ్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం.. కాసేపట్లో మోడీని కలువనున్న సింధు

ఢిల్లీలో పీవీ సింధుకు ఘన స్వాగతం పలికిన అధికారులు (Olympics)

ఢిల్లీలో పీవీ సింధుకు ఘన స్వాగతం పలికిన అధికారులు (Olympics)

పీవీ సింధుకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో ఆమె ప్రధాని మోడీని కలువనున్నది.

    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics 2020) కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu), అమె కోచ్‌కు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  (Delhi Airport) ఘనస్వాగతం లభించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన సింధు.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె గెలుపు కోసం ఎంతగానే శ్రమించిన దక్షిణ కొరియాకు చెందిన కోచ్ పార్క్ తెసాంగ్ కూడా ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా వందలాది మంది అభిమానులు వారిని స్వాగతించడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఢిల్లీ చేరుకున్న ఆమెకు విజయవాడ ఎంపీ కేశినేని నానీ, జాతీయ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.





    కాసేపట్లో ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌లను కలువనున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Badminton, Olympics, PM Narendra Modi, Pv sindhu, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు