Home /News /sports /

WARM WELCOME TO PAKISTAN JR HOCKEY TEAM JR CHOCKEY WORLD CUUP IS STAGED IN ODISHA FROM 24TH NOV TO 5TH DEC JNK

World Cup: భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జట్టు.. ఢిల్లీలో ఘన స్వాగతం.. రేపటి నుంచి వరల్డ్ కప్

ఇండియాకు వచ్చిన పాకిస్తాన్ హాకీ జట్టు (PC: Twitter/Hockey India)

ఇండియాకు వచ్చిన పాకిస్తాన్ హాకీ జట్టు (PC: Twitter/Hockey India)

Pakistan Team in India: జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టు ఇండియాకు వచ్చింది. ఢిల్లీలో ఆ జట్టుకు పాక్ హైకమిషన్ ఘన స్వాగతం పలికింది. భువనేశ్వర్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరుగనున్నది.

    ఇండియా - పాకిస్తాన్ (India - Pakistan) మధ్య రాజకీయ వైరం ఉన్నది. భారత క్రికెట్ జట్టు (Team India) ఎన్నో ఏళ్లగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ (Bilateral Series) ఆడటం లేదు. కనీసం పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో కూడా ఆడనివ్వడం లేదు. కేవలం ఐసీసీ (ICC) ఈవెంట్లలో మాత్రమే ఇండియా - పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇది కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. అన్ని రకాల ఆటల్లోనూ తటస్థ వేదికల్లో తప్ప ఇండియా - పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక పర్యటనలు లేవు. అయితే తాజాగా జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో (Jr Hockey World Cup) పాల్గొనేందుకు పాకిస్థాన్ జూనియర్ హాకీ జట్టు శనివారం భారత్‌కు చేరుకుంది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు భువనేశ్వర్‌లో ఈ టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ హైకమిషన్ ఇన్‌ఛార్జ్ అఫ్తాబ్ హసన్ ఖాన్ హాకీ జట్టుకు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైకమిషన్‌లోని సీనియర్ దౌత్యవేత్త బృందం హాకీ జట్టు సభ్యులను సాదరంగా ఆహ్వానించారు.

    కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పునఃప్రారంభించాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత పాకిస్థాన్ జూనియర్ హాకీ జట్టు భారత్ పర్యటనకు వచ్చింది. హైకమిషన్ ఇన్‌చార్జి హాకీ జట్టు గౌరవార్థం మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. హాకీని పాక్ జాతీయ క్రీడగా అభివర్ణిస్తూ.. ఆటగాళ్లు తమ సత్తాను చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృందం న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరుతుంది. జూనియర్ వరల్డ్ కప్ అక్కడే ఆడనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నవంబర్ 24న ఫ్రాన్స్‌తో ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ కళింగ స్టేడియంలో జరగనుంది. అదే సమయంలో పాకిస్థాన్ పూల్-డిలో ఉండగా.. ఈ గ్రూప్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్, జర్మనీ కూడా ఉన్నాయి.

    Novak Djocovic: జకోవిచ్ నెంబర్ వన్ స్థానానికి ఎసరు? వరుస పరాజయాలతో డీలా.. దూసుకొస్తున్న యువ ఆటగాళ్లు







    జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్ కోసం ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌ను సందర్శించే క్రీడాకారులు మరియు అధికారులు ప్రతి 72 గంటలకు RT-PCR పరీక్షలు తప్పక చేయించుకుంటారని ఒడిశా క్రీడా విభాగం సీనియర్ అధికారి శనివారం తెలిపారు. ప్రతిరోజూ సగటున 500 పరీక్షలు నిర్వహిస్తారని.. అదే రోజున ICMR యొక్క భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం (RMRC) రిపోర్టును తయారు చేసి పంపుతుందని అధికారులు చెప్పారు.

    IND vs NZ: హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం కనుగొన్న హార్దిక్ పాండ్యా.. ఆ యువ క్రికెటర్ పాండ్యా స్థానానికి ఎసరు


    ఒడిశా స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ సెక్రటరీ ఆర్ వినీల్ కృష్ణ మాట్లాడుతూ, “ప్రతి 72 గంటలకు ఒకసారి ఆటగాళ్ళు, అధికారులు, హోటల్ సిబ్బంది మరియు ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తాము. నవంబరు 24 నుంచి డిసెంబర్ 5 వరకు టోర్నీ జరుగనున్నన్ని రోజులు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌ను సురక్షితంగా చేసేందుకు మేము కృషి చేస్తున్నాము. వరల్డ్ కప్ గెలవాలనే పెద్ద కలలతో ఇక్కడికి వచ్చే జూనియర్ హాకీ క్రీడాకారులకు దీనిని చిరస్మరణీయం చేయాలని కోరుకుంటున్నాము' అని ఆయన అన్నారు.
    Published by:John Kora
    First published:

    Tags: Hockey, Odisha, Pakistan, World cup

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు