కేక్ కటింగ్‌పై దుమారం..సారీ చెప్పిన మాజీ క్రిెకెటర్..!

ముస్లింలు ఉపవాస దీక్షలో ఉండే ఈ రంజాన్ మాసంలో బర్త్ డే వేడుకలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వకార్ యూనిస్, వసీం అక్రమ్‌ను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడుకున్నారు. దీంతో ఎట్టకేలకు మాజీ క్రికెటర్లు దిగొచ్చారు. పాకిస్తాన్ ఫ్యాన్స్‌కు ట్విటర్ వేదికగా వకార్ యూనిస్ క్షమాపణలు కోరారు

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 2:00 PM IST
కేక్ కటింగ్‌పై దుమారం..సారీ చెప్పిన మాజీ క్రిెకెటర్..!
ఇంగ్లండ్-పాక్ రెండో టెస్టు మ్యాచులో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వసీం అక్రం
  • News18
  • Last Updated: June 6, 2018, 2:00 PM IST
  • Share this:
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ బర్త్ వేడుకలపై తీవ్ర దుమారం రేగింది. జూన్3న  ఆయన బర్త్ డే సందర్భంగా ఆ జట్టు మాజీ పేసర్ వకార్ యూనిస్ కేట్ కట్ చేశారు. ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న  పాకిస్తాన్ జట్టు ఈ వేడుకల్లో కనిపించలేదు. కానీ ఆ ఇద్దరు మాజీ ఆటగాళ్ల తీరుపై మాత్రం పాకిస్తాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్త్ డే చేసుకుంటే తప్పేంటని అనుకుంటున్నారా?

బర్త్ డే చేసుకుంటే తప్పేం లేదు. కానీ ముస్లింలు ఉపవాస దీక్షలో ఉండే ఈ రంజాన్ మాసంలో బర్త్ డే వేడుకలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వకార్ యూనిస్, వసీం అక్రమ్‌ను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడుకున్నారు. తమ మనోభవాలను కించపరిచేలా ప్రవర్తించారంటూ దుమ్మెత్తిపోశారు. దీనిపై దుమారం  రేగడంతో ఎట్టకేలకు మాజీ క్రికెటర్లు దిగొచ్చారు.

పాకిస్తాన్ ఫ్యాన్స్‌కు ట్విటర్ వేదికగా వకార్ యూనిస్ క్షమాపణలు కోరారు.  “ వసీం  భాయ్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసినందుకు క్షమాపణ చెబుతున్నా. పవిత్ర రంజాన్ మాసాన్ని, ఉపవాస దీక్షలో ఉన్న ప్రజలను గౌరవిస్తాం. అలా చేసి ఉండి కూడదు. సారీ..!. " అని వకార్ పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది. ఇక రెండో టెస్ట్ మ్యాచులో ఇన్నింగ్స్ 55 రన్స్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లండ్. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత ఇంగ్లండ్‌కు దక్కిన టెస్ట్ మ్యాచ్ విజయమిది. ఈ గెలుపుతో సిరీస్‌ 1-1తో సమమైంది.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading