VVS LAXMAN SHIFTED TO BENGALURU WITH FAMILY LAXMAN JOINS AS NCA CHIEF JNK
VVS Laxman: ఫ్యామిలీతో సహా బెంగళూరు షిఫ్ట్ అయిన వీవీఎస్ లక్ష్మణ్.. ఇకపై నో కామెంట్రీ.. నో సన్‌రైజర్స్ మెంటార్షిప్
నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్
VVS Laxman: భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో క్రికెట్ డైరెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 47 ఏళ్ల లక్ష్మణ్‌ను గత నెలలో భారత క్రికెట్ బోర్డు (BCCI) అతడిని NCA క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. భారత సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులైన రాహుల్ ద్రవిడ్ స్థానంలో అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే లక్ష్మణ్ ఇకపై ఐపీఎల్లో కోచ్‌గా ఉండలేడు.
వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) అంటే వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. అది అతడి పూర్తి పేరు. కానీ ఆసీస్ క్రికెటర్లు (Australia Cricketers) మాత్రం అతడిని వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలిస్తుంటారు. జెంటిల్మెన్ గేమ్‌లో నిజంగానే అంతటి కామ్ అండ్ కూల్ పర్సన్ వీవీఎస్. ఆట కోసం ఏమైనా చేయగల వ్యక్తి అని మరోసారి నిరూపించాడు. తన సహచర క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి (Sourav Ganguly) ఇచ్చిన మాట కోసం సొంత ఊరైన హైదరాబాద్‌ను వదిలిపెట్టి బెంగళూరు వెళ్లిపోయాడు. అది కూడా ఒంటరిగా కాదు. భార్య బిడ్డలతో సహా మొత్తం షిఫ్ట్ అయిపోయాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) (NCA) చీఫ్‌గా సోమవారం వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టాడు. గత వారమే కుటుంబంతో సహా వీవీఎస్ బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు.
రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఎన్సీఏ చీఫ్ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో బీసీసీఐ అతి ముఖ్యమైన ఆ స్థానంలో వీవీఎస్‌ను నియమించాలని భావించింది. అయితే వీవీఎస్ తొలుత ఈ ప్రతిపాదనను నిరాకరించాడు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని తిరస్కరించాడు. దీంతో సౌరవ్ గంగూలీ స్వయంగా రంగంలోకి దిగి ఆయనతో చర్చించాడు. దీంతో సానుకూలంగా స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మూడేళ్ల పాటు లక్ష్మణ్ ఈ పదవిలో కొనసాగనున్నాడు.
First day in office at the NCA! An exciting new challenge in store, look forward to the future and to working with the future of Indian cricket. pic.twitter.com/gPe7nTyGN0
వీవీఎస్ లక్ష్మణ్ పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇప్పుడు ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అవడంతో రాబోయే మూడేళ్ల పాటు వాళ్లు బెంగళూరులోనే చదువుకోబోతున్నారు. ఇక వీవీఎస్ లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్‌తో ఉన్న ఒప్పందాన్ని కూడా ముగించేశాడు. ఇండియా - న్యూజీలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు అనంతరం లక్ష్మణ్ మీడియా కాంట్రాక్టు నుంచి తప్పుకున్నాడు. ఇకపై ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజీ తరపున కూడా బాధ్యతలు నిర్వర్తించబోడవం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా కూడా లక్ష్మణ్ తప్పుకున్నాడు.
'టీమ్ ఇండియా కుర్రాళ్లను తయారు చేసే బాధ్యత ఇప్పడు లక్ష్మణ్‌పై ఉన్నది. అతను ఈ పదవికి సరైన ఎంపిక. ద్రవిడ్ స్థానాన్ని లక్ష్మణ్ తప్ప మరెవరూ భర్తీ చేయలేరు. భారత క్రికెట్ భవిష్యత్ కోసం తన కుటుంబంతో సహా బెంగళూరుకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు' అని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. అలాగే మనకు కొత్త టీచర్ దొరికాడు అంటూ రవిచంద్రన్ అశ్విన్ కూడా ట్వీట్ చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ చీఫ్‌గా అండర్-19 వరల్డ్ కప్ కోసం భారత జట్టుతో వెస్టిండీస్ కూడా వెళ్లనున్నాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.