37 సం.ల 10 మాసాల నిరీక్షణ...టీమిండియా గెలుపుపై లక్ష్మణ్

మెల్‌బోర్న్ టెస్ట్‌లో విజయం సాధించిన టీమిండియాకు పలువురు మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయంలో ఉన్న ఓ ప్రత్యేకతను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

news18-telugu
Updated: December 30, 2018, 4:28 PM IST
37 సం.ల 10 మాసాల నిరీక్షణ...టీమిండియా గెలుపుపై లక్ష్మణ్
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్
  • Share this:
మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రక విజయం సాధించడం పట్ల భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయం పట్ల భారత జట్టు సభ్యులకు అభినందనలు తెలుపుతూ...ఈ విజయం ఎంత ప్రత్యేకమైందో చెప్పారు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను టీమిండియా 137 పరుగుల తేడాతో మట్టికరిపించి చారిత్రక విజయం సాధించడం తెలిసిందే. ఈ విజయంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో భారత్ విజయం సాధించడం పట్ల సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, బీసీసీఐ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. భారత ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. టీమిండియాకు అభినందనలు తెలిపిన వీవీఎస్ లక్ష్మణ్...ఈ విజయంలోని ఓ ఆసక్తికర అంశాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.

మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో భారత జట్టు చివరగా 37 సంవత్సరాల 10 మాసాల క్రితం విజయం సాధించిందని చెప్పారు. అప్పటికి ఇరు జట్లలోని ఆటగాళ్లు ఎవరూ పుట్టలేదంటూ ట్వీట్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాకు ఇప్పుడు ఎంసీజీ మైదానంలో విజయం దక్కిందన్నారు.  ఈ విజయం సుదీర్ఘకాలం పాటు గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ విజయంతో 2018 సంవత్సరానికి టీమిండియా పర్ఫెక్ట్‌ ముగింపు పలికిందని లక్ష్మణ్ అభినందించాడు.

Video: మెల్‌బోర్న్ టెస్ట్‌లో విజయం తర్వాత టీమిండయా సెలబ్రేషన్స్

ఇవి కూడా చదవండి..

2018కి గ్రాండ్‌ ముగింపు పలికిన విరాట్ సేన... ఫ్యాన్స్‌కి న్యూఇయర్ గిఫ్ట్...


బాక్సింగ్ డే టెస్ట్ హీరో బుమ్రా... రికార్డులు బద్దలు
First published: December 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు