ఆగస్టు 2021లో జరుగునున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన వలోరెంట్ కాంకరర్స్ చాంఫియన్‌షిప్ (వీసీసీ) కోసం అర్హత సాధించిన మొట్టమొదటి దక్షిణాసియా టీం VLT Sentinel. దీని హైదరాబాద్‌కు చెందిన వెలాసిటీ గేమింగ్ సంస్థ అధినేత గోవిందరాజు మనోజ్ కశ్యప్ కృషి చాలానే ఉంది. ఓవైపు క్యాజువల్ గేమర్గా తన ఆశయాన్ని నెరవేర్చుకుంటూ, మరోవైపు కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్న 34 ఏళ్ళ మనోజ్ కశ్యప్... ఇ-స్పోర్ట్స్‌లో లక్షల మంది యువతకి ఆదర్శం. తన సొంత గేమింగ్ వింగ్ VLT సెంటినెల్‌లో దాదాపు లక్షన్నర మంది గేమర్లు ఉన్నారు. దీంతో భారత దేశంలోనే అత్యధిక ఈ గేమర్స్ యారెనాగా సెంటినెల్ ప్రాచుర్యం పొందింది.
హార్వార్డ్ యూనివర్శిటీకి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన కశ్యప్... 10 ఏళ్ల వయసు నుంచి కూడా గేమింగ్ పట్ల అమితాసక్తిని కనబరిచే వాడు. నిటెండో, ఎక్స్‌బాక్స్ వంటి కన్సోల్ గేమ్స్‌ను ప్రయత్నించిన అతను, అనంతర కాలంలో హైదరాబాద్, భారతదేశ వ్యాప్తంగా వరల్డ్ సైబర్ గేమ్స్ (డబ్ల్యుసీజీ) నిర్వహించిన కౌంటర్ సైట్రెక్ టోర్నమెంట్స్‌లో పోటీపడ్డారు. ఇ–స్పోర్ట్స్ ప్రొఫెషనల్‌గా మారడం నుంచి ఓ ఇ-స్పోర్ట్స్ ఔట్‌ఫిట్‌ను సొంతం చేసుకునేంత వరకూ టీఎం సెంటినల్‌గా అత్యంత ప్రాచుర్యం పొందాడు. వీడియో గేమ్స్ వినియోగించుకుని నిర్వహించే ఓ విధమైన పోటీ ఇ-స్పోర్ట్స్. ప్రొఫెషనల్ ప్లేయర్లు, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా పోటీపడుతుంటారు. ఇ-స్పోర్ట్స్ ఇప్పుడు వీడియో గేమ్ పరిశ్రమలో అతి ముఖ్యమైన విభాగంగా మారాయి. 2010 వ సంవత్సరం నుంచి ఎంతో మంది గేమ్ డెవలపర్లు చురుగ్గా గేమ్స్ డిజైన్ చేయడంతో పాటుగా టోర్నమెంట్లు, ఇతర కార్యక్రమాల కోసం ఫండింగ్‌ను సైతం అందిస్తున్నారు. ఇ-స్పోర్ట్స్ వీక్షకులలో అధికశాతం 18 నుంచి 34 ఏళ్లవారే కావడంతో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మరీ ముఖ్యంగా భారతదేశంలో అధిక ప్రజాదరణ లభిస్తుంది.
భారతీయ ఇ-స్పోర్ట్స్ ఔట్ఫిట్, వెలాసిటీ గేమింగ్‌ను 33 సంవత్సరాల వ్యాపారవేత్త నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ రికార్డు స్థాయిలో వరుసగా 24 విజయాలను సొంతం చేసుకుంది. ఈ రికార్డును వేరెవ్వరూ ఇప్పటి వరకూ బద్దలుకొట్టలేదు. వెలాసిటీ గేమింగ్ యొక్క బృందం 2020లో జరిగిన 15 టోర్నమెంట్లలో 13 ఆడటమే కాదు, అన్నిటిలోనూ విజయం సాధించింది. థాయ్‌ల్యాండ్, మయన్మార్, సింగపూర్ వంటి దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ బృందాలను సైతం అధిగమించి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో వెలాసిటీ గేమింగ్ ఇప్పుడు మూడవర్యాంక్ సాధిస్తే, ఇండియాలో నెంబర్ 1 ర్యాంక్‌ను పొందింది.
వలోరెంట్ కాంకరర్స్ చాంఫియన్‌షిప్‌ను యుఎస్ కేంద్రంగా కలిగిన ప్లేయర్ ఫోకస్డ్ గేమ్ డెవలపర్, పబ్లిషర్ రియోట్ గేమ్స్ నిర్వహిస్తుంది. ఈ చాంఫియన్ షిప్ విజేత వీసీసీ చాంఫియన్‌షిప్ టైటిల్‌తో పాటుగా 33వేల డాలర్ల బహుమతి మొత్తంలో అత్యధిక వాటానూ పొందగలరు. రియోట్స్ వాలోరెంట్ గేమ్‌ను జూన్ 2020లో విడుదల చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా 44 మిలియన్ల మంది యూజర్లు అంతర్జాతీయంగా ఉన్నారు.
వెలాసిటీ గేమింగ్ యొక్క మొత్తం కార్యకలాపాలకు మనోజ్ కశ్యప్ ఒక్కరే నిధులను సమీకరిస్తున్నారు. అయితే, ఈ కంపెనీ ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియో(మరిన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను గెలుచుకున్న తరువాత)ను శక్తివంతంగా మార్చుకున్న తరువాత బాహ్య పెట్టుబడిదారుల నుంచి కూడా నిధులను సమీకరించాలని చూస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.