Home /News /sports /

VIRENDRA SEHWAG SPECIAL TIP TO INDIAN BATSMEN WHO IS FEARING TO FACE ANDERSON BOWLING CHECK THIS SPECIAL MANTRA JNK

Sehwag Baba: భారత బ్యాట్స్‌మెన్ అండర్సన్ బౌలింగ్‌లో ఈ మంత్రం చెప్పి బ్యాటింగ్ చేయాలంటా..! బాబా సెహ్వాగ్ స్పెషల్ టిప్

అండర్సన్ బౌలింగ్ ఎదుర్కునే ముందు ఈ మంత్రం చెప్పండి.. (PC: Twitter/Sehwag)

అండర్సన్ బౌలింగ్ ఎదుర్కునే ముందు ఈ మంత్రం చెప్పండి.. (PC: Twitter/Sehwag)

ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ అండర్సన్ బౌలింగ్‌లో ఆడటానికి భయపడుతున్న భారత బ్యాట్స్‌మెన్‌కు 'బాబా సెహ్వాగ్' ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటిస్తే ఎవరూ అతడి బౌలింగ్‌లో అవుట్ కారని చెబుతున్నాడు. ఇంతకు ఏంటా సలహా.. ఏంటా మంత్రం?

    ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) ఉన్న భారత జట్టు (Team India) ప్రస్తుతం లార్డ్స్ (The Lord's) వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్నది. తొలి టెస్టులో విజయం వరకు వచ్చినా.. వరుణుడు అడ్డు తగలడంతో భారత జట్టు డ్రాతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక రెండో టెస్టులో భారత జట్టు ఓపెనర్లు సరైన శుభారంభమే ఇచ్చారు. స్కోర్ కనీసం 450 దాటుతుందని అభిమానులు భావించారు. కానీ అండర్సన్ ఐదు వికెట్లతో భారత జట్టును కట్టడి చేశాడు. 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ అండర్సన్ బౌలింగ్‌లో ఏ మాత్రం పస తగ్గలేదు. తొలి టెస్టులో కూడా కీలకమైన వికెట్లు తీశాడు. ముఖ్యంగా కోహ్లీ, పుజారాను వెనక్కు పంపాడు. ఇక రెండో టెస్టులో అజింక్య రహానేను పెవీలియన్ చేర్చి.. భారత జట్టు భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. ఇంగ్లాండ్-ఇండియా మ్యాచ్ జరిగిన ప్రతీసారి చతేశ్వర్ పుజార, కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్లను అండర్సన్ తీస్తున్నాడు. అతడికి వీళ్లిద్దరూ రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు. అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి భయపడుతున్న భారత బ్యాట్స్‌మెన్.. ముఖ్యంగా రహానే, కోహ్లీ, పుజారాలకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag) ఒక మంత్రాన్ని సూచించాడు.

    అండర్సన్ బౌలింగ్ అంటే భయపడుతూ.. ఇబ్బందిగా బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్‌మెన్ అంతా ముందు కొచ్చి 'జై భజరంగ్ బలి' అనే మంత్రం గట్టిగా పఠించాలని చెప్పాడు. అండర్సన్ బంతి పట్టుకొని పరుగెడుతూ క్రీజ్ వద్దకు రాగానే ఒకడుగు ముందుకు వేసి గట్టిగా ఈ మంత్రం జపించండి.. అప్పుడు పరుగులు రాకపోయినా ఔట్ అయితే కాకుండా బతికిపోతారు అని చెప్పాడు. ఎందుకంటే ముందు కొచ్చి ఆడటం వల్ల క్లీన్ బౌల్డ్ అవడం గానీ.. లోపలకు వచ్చే బంతుల వల్ల ఎల్బీడబ్ల్యూ కానీ అవరని సెహ్వాగ్ చెబుతున్నాడు. గతంలో పుజారా, కోహ్లీనే అవుటయ్యే వాళ్లు.. ఇప్పుడు రహానే కూడా వీళ్లకు జత కలిశాడు. కాబట్టి ఈ ముగ్గురు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆడేయండి అంటూ ఉచిత సలహా పారేశాడు. సెహ్వాగ్ సలహా విని అందరూ తెగ నవ్వుకుంటున్నారు. కొంత మంది అయితే ఇది లగాన్ సినిమా నుంచి కాపీ చేసిన షాట్ అని చెప్పుకొస్తున్నారు. అందులో కూడా బ్రిటిష్ టీమ్ బౌలర్‌ను ఎదుర్కోవడానికి పూజారి పాత్ర వేసిన క్యారెక్టర్ బ్యాటుతో షాట్ కొట్టే ముందు 'జై భజరంగ్ బలి' అనే అరుస్తాడు. బౌండరీలు కూడా బాదేస్తుంటాడు. ఆ సీన్‌ను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు.





    వీరేంద్ర సెహ్వాగ్ మరో ట్వీట్‌లో కోహ్లీ ఫామ్‌పై చర్చించాడు. కోహ్లీ ఎన్ని పరుగులు చేసినా.. సెంచరీ చేయకపోతే ఫ్యాన్స్ అతడు ఫామ్‌లో లేడనే భావిస్తారని చెప్పాడు. ఇటీవల ఇద్దరు విద్యార్థినులు 99.99, 99.97 పర్సెంటేజీ మార్కులు వచ్చినా.. 100 శాతం రావాలని ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ రాశారు. వారిద్దరికీ తర్వాత పరీక్షలో 100 శాతం వచ్చాయి. అలాగే కోహ్లీ కూడా 99 పరుగులు చేసినా ఫ్యాన్స్ పట్టించుకోరని.. అతడు సెంచరీ కొట్టాల్సిందేనని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ చేయక రెండేళ్లు కావొస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cheteswar Pujara, India vs england, Team india, Virat kohli, Virender Sehwag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు