ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో హార్దిక్ పాండ్యతో బౌలింగ్ చేయకపోవడంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) పెదవి విరిచారు. జట్టుకు అవసరమైనప్పుడు సమయంలో బౌలింగ్ ఇవ్వకపోతే ఎలా అని విమర్శించాడు. అతడి సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తున్నారో తెలియదన్నాడు. నిజానికి మైదానంలో 50 ఓవర్లు వరకు ఫీల్డింగ్ చేసినా అలసిపోతారు కదా అలాంటి మరో యాక్షన్‌కు అతన్ని బదిలిస్తే ఫలితం ఉంటుంది కదా అంటూ మూడో వన్డే సందర్భంగా వీరూ ఈ విమర్శల చేశాడు.
టీమిండియా ప్రతి ఓటమి జట్టులోని లోపాలను ఎత్తిచూపింది. రెండో వన్డేలో టీమ్ఇండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 43.3 బంతుల్లోనే ఛేదించింది. టీమిండియా స్పీన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. పేసర్లు భువనేశ్వర్, ప్రసిద్ధ్ కృష్ణను మినహా అందరిని ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ దారుణంగా బాదేశారు. స్పినర్లు కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యను.. స్టోక్స్,జాన్ బెయిస్ట్రో
ఉతికికారేశారు. ఈ సమయంలో కెప్టెన్ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆరో బౌలర్ పాండ్యాను రంగంలోకి దింపి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ చితకబాదుతున్న హార్దిక్‌కు విరాట్ బంతినివ్వలేదు.
టీమిండియా కొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న దృష్ట్యా ప్రయోగాలు ముఖ్యామని.. అయితే హార్థిక్ జట్టుకు అత్యంత కీలకం, అతడి పనిభారాన్ని పర్యవేక్షిస్తున్నాం అంటూ మ్యాచ్ తర్వాత కోహ్లీ ఇచ్చిన వివరణపై సెహ్వాగ్ మండిపడ్డాడు.
" వన్డే సిరీస్ అనంతరం ఐపీఎల్ మాత్రమే ఉంది. హార్దిక్ పాండ్యపై పనిభారం పడుతుందని మ్యాచ్ ఓడిపోయినా ఫర్వాలేదా.. అతడి బాధ్యతగా కనీసం 4-5 ఓవర్లైనా వేయించకపోవడం పోరపాటుగానే భావించాల్సి ఉంటుంది. పాండ్యా చేత ఒక్క ఓవర్ కూడా వేయించారా? 50 ఓవర్ల ఫీల్డింగ్ చేస్తే అలసటకు కారణం కాదా... 4-5 ఓవర్లు వేసినంత మాత్రనా అతడిపై పనిభారమేమీ పెరగదు" అంటూ సెహ్వాగ్ మండిపడ్డాడు.
ఆటలో హార్థిక్ పాత్రను ఎవరూ నిర్ణయిస్తారో నాకు తెలియదు కానీ.. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత అతను పెద్దగా మ్యాచ్లేమి ఆడలేదు. టెస్టు మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చారు. 5 టీ20ల్లో అతను 2-3 ఓవర్లే వేశాడు. అతడేం ఎక్కువ శ్రమ పడలేదు. అయితే ముందు ఐపీఎల్ ఉంది కాబట్టి అందకూ జాగ్రత్త పడుతూ వన్డేల్లో బౌలింగ్ చేయనని పాండ్యనే తెలిపి ఉండవచ్చని’ వీరూ అభిప్రాయపడ్డాడు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.