ప్రీతి జింటాకు షాక్... కింగ్స్ లెవెన్‌కు సెహ్వాగ్ రాజీనామా

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటర్ బాధ్యత నుంచి కూడా తప్పుకుంటున్న ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్... హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్‌ నియామకం!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 4, 2018, 4:59 PM IST
ప్రీతి జింటాకు షాక్... కింగ్స్ లెవెన్‌కు సెహ్వాగ్ రాజీనామా
కింగ్స్ లెవెన్ పంజాబ్ కో- ఓనర్ ప్రీతిజింటాతో మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్
  • Share this:
ఐపీఎల్ 2019 ప్రారంభమానికి ముందే కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు షాక్ తగిలింది. గత మూడేళ్లు పంజాబ్ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహారిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్... ఆ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఐపీఎల్ ప్రారంభంలో ఢిల్లీ జట్టుకు ఆడిన ఈ మాజీ ఓపెనర్... ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ జట్టు తరుపున కూడా ఆడాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత మెంటర్‌గా వ్యవహరించిన వీరేంద్ర సెహ్వాగ్... తాజాగా ఆ బాధ్యత నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. రెండు సీజన్లు ప్లేయర్‌గా, మూడు సీజన్లు మెంటర్‌గా తనకెంతో అద్భుతమైన జ్ఞాపకాలను మిగిల్చిన కింగ్స్ ఎలెవన్ జట్టుకు ధన్యవాదాలు తెలుపుతూ, తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు వీరేంద్ర సెహ్వాగ్.

మంచి పనులు కూడా ఎప్పుడో ఒకసారి ముగించాల్సిందే. కింగ్స్ ఎలెవన్ జట్టుతో రెండు సీజన్లు ఆటగాడిగా, మూడు సీజన్లు మెంటర్‌‌గా ఎన్నో అద్భుతమైన సమయం గడిపాను. కింగ్స్ 11తో నా బంధం ముగింపుకి వచ్చింది. టీమ్‌కు ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్...

వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్


ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 27.55 సగటుతో 2728 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 16 అర్ధశతకాలు కూడా ఉన్నాయి. కింగ్ ఎలెవన్ పంజాబ్‌కు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది జట్టు యాజమాన్యం.


Published by: Ramu Chinthakindhi
First published: November 4, 2018, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading