హోమ్ /వార్తలు /క్రీడలు /

Virender Sehwag : ఐపీఎల్‌కు వచ్చింది ఎంజాయ్ చేయడానికే.. మ్యాక్స్‌వెల్‌పై సెహ్వాగ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు!

Virender Sehwag : ఐపీఎల్‌కు వచ్చింది ఎంజాయ్ చేయడానికే.. మ్యాక్స్‌వెల్‌పై సెహ్వాగ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు!

maxwell (ఫైల్ ఫోటో)

maxwell (ఫైల్ ఫోటో)

Virender Sehwag : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత డ్రింక్స్ తాగి తందాన చేయడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు.

ఇంకా చదవండి ...

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత డ్రింక్స్ తాగి తందాన చేయడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్‌ అతనికి పారితోషికం తీసుకొనే ఒక విహారయాత్రగా మారిందన్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. విధ్వంసకర ఆటగాడైన ఈ ఆసీస్ ప్లేయర్ కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.

13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. దాంతో మ్యాక్సీ పనైపోయిందనుకున్నారు అంతా. కానీ ఆస్ట్రేలియా వేదికగా భారత్‌తో వన్డే, టీ20ల్లో మ్యాక్సీ బ్రహ్మాండంగా రాణించాడు. భారత అభిమానులను, ముఖ్యంగా కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ, ఫ్యాన్స్‌ను వెర్రివాళ్లను చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన సెహ్వాగ్ మ్యాక్సీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడితో ఆస్ట్రేలియా జట్టుకు బాగా ఆడుతున్న గ్లేన్‌.. ఐపీఎల్‌ను మాత్రం లైట్ తీసుకొని విఫలమయ్యాడని దుయ్యబట్టాడు.

Virender Sehwag
వీరేంద్ర సెహ్వాగ్

‘ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగితే మ్యాక్సీ యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. పైగా రెండు ఇన్నింగ్స్‌లు బాగా ఆడకపోతే జట్టులో చొటు ఉండదని, మళ్లీ పునరాగమనం చేయడం కూడా కష్టమని మ్యాక్సీకి బాగా తెలుసు. ఆ ఒత్తిడితోనే అతను రాణిస్తున్నాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం మ్యాక్సీ ఎలాంటి ఒత్తిడి తీసుకోవడం లేదు. కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆడుతున్నాడు. ఆడినా ఆడకున్నా డబ్బులు వస్తాయనే ఆలోచన దృక్పథంలో ఉన్నాడు. దాంతో మైదానం, బయటా ఆడుతూ పాడుతూ తందాన చేస్తున్నాడు. ఉచిత సదుపాయాలను ఆస్వాదిస్తున్నాడు. క్యాచ్‌రిచ్ లీగ్‌లో అతను ఎప్పుడూ సీరియస్‌గా లేడు. ఆట పట్ల అంకితభావం ప్రదర్శించలేదు. ఐపీఎల్‌కు వచ్చినప్పుడల్లా క్రికెట్ కన్నా గోల్ఫ్‌పైనే సీరియస్‌గా దృష్టిసారిస్తాడు. అతను సీరియస్‌గా ఉంటే ఎలా ఆడుతాడో మనకు తెలిసిందే'అని వీరూ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 82 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ.. 22 సగటుతో 1505 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 95 అత్యధిక స్కోర్. బౌలింగ్‌లో మాత్రం 19 వికెట్లు తీశాడు. అతని సామర్థ్యం, నైపుణ్యానికి ఇది ఏమాత్రం సరిపోదు. ప్రతీ సీజన్ వేలానికి ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసకర ఆటతో చెలరేగడం.. భారీ ధరకు అమ్ముడుపోయి ఐపీఎల్‌లో నిరాశ పరచడం మ్యాక్సీకి అలవాటైపోయింది.

First published:

Tags: Glenn Maxwell, IPL, IPL 2020, Virender Sehwag

ఉత్తమ కథలు