Home /News /sports /

VIRENDER SEHWAG MAKES BIG REVELATION AND MADE SHOCKING COMMENTS ON TEAM INDIA FORMER SKIPPER MS DHONI SRD

Virender Sehwag : సచిన్ ను పొగుడుతూ.. ఇన్ డైరెక్ట్ గా ధోనిని టార్గెట్ చేసిన సెహ్వాగ్..

వీరేంద్ర సెహ్వాగ్​ (ఫైల్​ ఫొటో)

వీరేంద్ర సెహ్వాగ్​ (ఫైల్​ ఫొటో)

Virender Sehwag : 2008 ఆస్ట్రేలియా సిరీస్ లో ఫామ్ లేమితో బాధపడ్డ సెహ్వాగ్ ను ధోని... జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్ నుంచి వేటు వేయడంపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

    వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) గ్రౌండ్ లోనే కాదు.. బయట కూడా డాషింగ్ గానే ఉంటాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. క్రికెట్ లో ఎవరైనా సరిగ్గా ఆడకపోతే.. ముఖమ్మీదే చెప్పగలిగే మనస్తత్వం వీరూది. అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket)కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్‌, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన పదునైన రాతలతో విమర్శకులకు ఇదే వేదిక ద్వారా జవాబిస్తుంటాడు. సెహ్వాగ్‌ పోస్టింగ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక, వీరూకి.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విభేదాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    2008 ఆస్ట్రేలియా సిరీస్ లో ఫామ్ లేమితో బాధపడ్డ సెహ్వాగ్ ను ధోని... జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్ నుంచి వైదొలిగించడంపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని జట్టు నుంచి తప్పించేసరికి లిమిటెడ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనుకున్నానని.. కానీ, సచిన్ తన వ్యాఖ్యలతో నా మనసు మార్చడానికి వీరూ తెలిపాడు.

    ఇటీవల క్రిక్ బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' 2008 సిరీస్ నుంచి తప్పించేసరికి నేను ఇక.. లిమిటెట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఓన్లీ టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడాలనుకున్నాను. కానీ, సచిన్ చేసిన వ్యాఖ్యలతో నా మనసు మార్చుకున్నాను. సచిన్ నీకు ఇదొక బ్యాడ్ ఫేస్ మాత్రమే అన్నాడు. ఇంకా నీ దగ్గర క్రికెట్ ఆడే సత్తా ఉందని.. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రశాంతగా కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పాడని.. ఆ తర్వాత నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను ' అని సెహ్వాగ్ తెలిపాడు.

    ఇది కూడా చదవండి : కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై గృహలక్ష్మీ సీరియల్ తులసి అంత మాట అనేసిందేంటి?

    ఇక, భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. భార‌త క్రికెట్ జ‌ట్టు ఎన్నో ఏళ్లుగా ఎదురూచూసిన ట్రిపుల్ సెంచ‌రీ లోటును తీర్చిన వ్య‌క్తి సెహ్వ‌గే. సునీల్ గావ‌స్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌లాంటి దిగ్గ‌జాల‌కు సాధ్యం కానీ ఈ ఘ‌న‌త‌ను త‌న‌దైన శైలిలో సెహ్వాగ్ సాధించాడు. 2004లో పాకిస్థాన్‌పై తొలిసారిగా ట్రిపుల్ సెంచ‌రీ సాధించిన సెహ్వాగ్‌.. మ‌రో నాలుగేళ్ల‌కే అంటే 2008లో ద‌క్షిణాఫ్రికాపై ఈ ఫీట్‌ను మరోసారి రిపీట్ చేశాడు. ఇక, సెహ్వాగ్ 103 టెస్టులాడగ, 251 వన్డే మ్యాచ్ లాడాడు. వరుసగా 8,586 మరియు 8,273 పరుగులు చేశాడు. టెస్ట్ ల్లో 23 సెంచరీలు చేస్తే.. వన్డేల్లో 15 శతకాలు బాదాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, MS Dhoni, Sachin Tendulkar, Team India, Virender Sehwag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు