సిగ్గు లేదా..ఓట్ల కోసం నా పేరును వాడుకుంటారా? సెహ్వాగ్ ఫైర్

సెహ్వాగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. టీ10 లీగ్ జరుగుతున్నందున టోర్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. మరాఠా అరేబియన్స్ జట్టుకు ఆయన బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: December 3, 2018, 10:45 PM IST
సిగ్గు లేదా..ఓట్ల కోసం నా పేరును వాడుకుంటారా? సెహ్వాగ్  ఫైర్
సెహ్వాగ్ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఎన్నికల్లో ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతుంటాయి పార్టీలు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంతో పాటు స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి రోడ్ షోలు చేయిస్తుంటారు. సినీ తారలను, క్రీడాకారులతోనూ ప్రచారం నిర్వహిస్తారు. ఐతే రాజస్థాన్‌లోనూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను రంగంలోకి దింపింది ఓ పార్టీ. ''ఎన్నికలకు సభకు సెహ్వాగ్ వచ్చి ప్రసంగిస్తారు. ప్రజలంతా భారీగా తరలిరావాలి'' అని న్యూస్ పేపర్లో యాడ్ వేయించింది. ఇది ఈ విషయం ఎలాగోలా చివరకు సెహ్వాగ్‌ను చేరింది. ఆ పేపర్ చదివిన సెహ్వాగ్ ఖంగుతిన్నారు. తనకు సంబంధం లేకుండానే పేపర్ ప్రకటన ఇచ్చారని సదరు రాజకీయ పార్టీలపై మండిపడ్డారు.

రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ నవంబరు 29న అసింద్‌లో ఎన్నికల సభ నిర్వహించింది. అందుకు ఒక రోజు ముందు అన్ని పేపర్లలో ఓ ప్రకటన ఇచ్చింది. సభకు వీరేంద్ర సెహ్వాగ్ హాజరవుతారని..తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించింది. ఆ తప్పుడు ప్రకటనపై సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ప్రజలను మోసం చేసేందుకు తన పేరును వాడుకుంటారా? సిగ్గు లేదా అని ట్విటర్‌లో నిప్పులు చెరిగారు. అధికారం కోసం మరీ ఇంతలా దిగుజారుతారా? అంటూ విరుచుకుపడ్డారు.

సెహ్వాగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. టీ10 లీగ్ జరుగుతున్నందున టోర్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. మరాఠా అరేబియన్స్ జట్టుకు ఆయన బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చారు.
First published: December 3, 2018, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading