India Vs Pakistan: ఎండొచ్చింది... మాంచెస్టర్‌ వెదర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్

India Vs Pakistan: సెహ్వాగ్ పోస్టు చేసిన ఫోటోలతో... క్రికెట్ అభిమానుల్లో కాస్త సంతోషం నెలకొన్నా... లోలోపల మాత్రం వానభయం వెంటాడుతోంది.

news18-telugu
Updated: June 16, 2019, 1:21 PM IST
India Vs Pakistan: ఎండొచ్చింది... మాంచెస్టర్‌ వెదర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్
మాంచెస్టర్‌లో ఎండ
news18-telugu
Updated: June 16, 2019, 1:21 PM IST
మరి కాసేపట్లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌ జరిగే వేదిక మాంచెస్టర్ వాతావరణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాల్టి మ్యాచ్‌కు వాన గండం ఉందటూ క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ సెహ్మాగ్ ఆసక్తికరమైనపోస్టు పెట్టాడు. మాంచెస్టర్‌‌లో ఆకాశం నిర్మలంగా ఉందని, సూర్యుడు కనిపించాడని చెబుతూ కొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన సెహ్వాగ్, మాంచెస్టర్ వెదర్ ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నాడు.

ఈ ఫొటోల్లో ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు తప్ప, వర్షం కురిపించే దట్టమైన మేఘాలు కనిపించకపోవడం గమనార్హం. అయితే, మ్యాచ్ మొదలయ్యే సమయానికి వరుణుడు వచ్చేస్తాడని బ్రిటన్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మ్యాచ్ మధ్యలో ఒకటి, రెండుసార్లు వర్షం కురుస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సెహ్వాగ్ పోస్టు చేసిన ఫోటోలతో... క్రికెట్ అభిమానుల్లో కాస్త సంతోషం నెలకొన్నా... లోలోపల మాత్రం వానభయం వెంటాడుతోంది.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. మాంచెస్టర్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచకప్‌కే ఆకర్షణ అయిన ఈ మ్యాచ్‌ కూడా రద్దయితే టోర్నీ కళ తప్పడం ఖాయం. అందుకే ఈ మ్యాచ్‌ జరగాలని ఐసీసీ సైతం ఎంతగానో కోరుకుంటోంది.


First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...