ఆసియాకప్ గెలిచిన రోహిత్ సేనకు విరాట్ కోహ్లీ ప్రశంస..!

బాగా ఆడారు, బంగ్లా మంచి పోటీ ఇచ్చిందంటూ కోహ్లీ ట్వీట్... బంగ్లాదేశ్ విజయానికి చాలా దగ్గరగా వచ్చి, చాలా వెనకే ఉండిపోయిందన్న వీరేంద్ర సెహ్వాగ్... బంగ్లా పోరాట ప్రతిమను అభినందించిన సీనియర్లు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 29, 2018, 7:17 PM IST
ఆసియాకప్ గెలిచిన రోహిత్ సేనకు విరాట్ కోహ్లీ ప్రశంస..!
విరాట్ కోహ్లీ, రోహిత్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 29, 2018, 7:17 PM IST
ఆసియాకప్‌లో గెలిచిన రోహిత్ సేనను భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించారు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత విరాట్ విశ్రాంతి తీసుకోవడంతో, కోహ్లీ లేకుండానే ఆసియాకప్ ఆడింది భారత జట్టు. తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహారించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో దుబాయ్ చేరిన భారత జట్టు... ఏడోసారి ఆసియాకప్ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. రోహిత్, విరాట్ మధ్య మనస్ఫర్థలున్నాయని, ఇద్దరికీ పడడం లేదని కొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే వాటిని పక్కనపెట్టి రోహిత్ శర్మనూ, టీమిండియాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు విరాట్.

‘గ్రేట్ జాబ్ గాయ్స్... ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను గెలిచి, మనకోసం ఏడోసారి ఆసియాకప్ తీసుకొచ్చారు. బంగ్లాదేశ్ జట్టు కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చింది. వాళ్లని కూడా అభినందించాల్సిందే...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ.


భారత మాజీ క్రికెటర్, సీనియర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమిండియాను ప్రశంసించారు. ‘బంగ్లాదేశ్ విజయానికి చాలా దగ్గరగా వచ్చి, చాలా వెనకే ఉండిపోయింది. ఆసియాకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. కీలక ఆటగాళ్లు లేకపోయినా టీమిండియాకు గట్టిపోటీ ఇచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే... టీమిండియా విజయానందంలో మునిగిపోకుండా తప్పులకు సవరించుకోవడంపై దృష్టి పెట్టాలి. వాళ్లు మరింత బలంగా మారతారని నాకు నమ్మకముంది...’ అంటూ ట్వీట్ చేశాడు వీరూ.
Loading...సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.మాజీ క్రికెటర్, ‘బెస్ట ఫీల్డర్ అవార్డ్’ విన్నర్ మహ్మద్ కైఫ్ కూడా టీమిండియాకు అభినందనలు తెలిపారు. ‘టోర్నీ మొత్తం భారత బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. వారి ప్రదర్శనే ఈ విజయానికి కారణం. బంగ్లా ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. రోహిత్ జట్టును నడిపించిన విధానం బాగుంది. కీలక సమయంలో బౌలింగ్ మార్చి విధానం బాగుంది. మిడిలార్డర్ వైఫల్యం జట్టును బాధపెడుతోంది. దాన్ని అధిగమించాల్సి అవసరం ఎంతో ఉంది...’ అంటూ ట్వీట్ చేశారు కైఫ్.

మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియాను, గట్టి ఫైట్ ఇచ్చిన బంగ్లాదేశ్ జట్టునూ అభినందిస్తూ పోస్టు చేశారు.భారత జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా టీమిండియాను అభినందిస్తూ పోస్ట్ చేశారు.First published: September 29, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...