టెస్ట్‌ల్లో హిస్టరీ...వన్డే‌ సిరీస్‌లో విరాట్ సేన ఏం చేయబోతోంది...??

టెస్ట్‌ల్లో హిస్టారిక్ సిరీస్ విక్టరీ నమోదు చేసిన కొహ్లీ సేన...వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా...కంగారూ టీమ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

advertorial
Updated: January 10, 2019, 11:51 AM IST
టెస్ట్‌ల్లో హిస్టరీ...వన్డే‌ సిరీస్‌లో విరాట్ సేన ఏం చేయబోతోంది...??
ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కొహ్లీ, ధోనీ ఫైల్ పోటో ( bcci/ twitter )
advertorial
Updated: January 10, 2019, 11:51 AM IST
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రికార్డ్‌లున్నవి బద్దలు కొట్టడానికే అని భారత జట్టు మరోసారి నిరూపించింది. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లో విరాట్ కొహ్లీ సారధ్యంలోని టీమిండియా సరిగ్గా అదే చేసింది. టెస్ట్‌ల్లో హిస్టారిక్ సిరీస్ విక్టరీ నమోదు చేసిన కొహ్లీ సేన...వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా...కంగారూ టీమ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. సిడ్నీ‌లో ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ మెల్‌బోర్న్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ సేన రెండో స్థానంలో ఉండగా...ఆసీస్ టీమ్ 6వ స్థానంలో ఉంది. టెస్ట్‌ జట్టుతో పోల్చుకుంటే ఆరోన్ ఫించ్ సారధ్యంలోని ఆస్ట్రేలియా వన్డే జట్టు బలంగానే ఉంది. తొలి వన్డే కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నారు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్:12 జనవరి, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి వన్డే

15 జనవరి, అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా రెండో వన్డే

18 జనవరి, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో వన్డే
Loading...
వన్డే సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, ధోనీ, కేదార్ జాదవ్, కె ఎల్ రాహుల్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్య.

ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌ను ఓడించి కొహ్లీ సేన క్రియేట్ చేసిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. అక్కడ సిరీస్ నెగ్గిన తొలి ఆసియా దేశంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 1947 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు కల ఎట్టకేలకు నెరవేరింది. కంగారూ గడ్డపై భారత్‌కు టెస్ట్ సిరీస్ విజయాన్నందించిన తొలి కెప్టెన్‌గా విరాట్ తనకుతాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు.

గత ఏడు దశాబ్దాలుగా సొంతగడ్డపై ఎదురులేని కంగారూలకు చెక్ పెట్టి చరిత్రను తిరగరాసింది. ఓ ఆసియా దేశం ఆస్ట్రేలియాలో నెగ్గడానికి 71 ఏళ్లు పట్టింది. ఆ ఘనత భారత్‌కే దక్కడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సిడ్నీ టెస్ట్ ముగిశాక భారత క్రికెటర్లు మునుపెన్నడూ లేనంతలా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా అదే రీజన్.

First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...