IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌...నెం.1 ర్యాంక్‌పై కన్నేసిన కోహ్లీసేన

India Vs Australia Oneday Series - ICC ODI Rankings | 2016లో కంగారూ గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు 1-4తో చిత్తుగా ఓడింది. ఆ ఓటమికి బదులు తీర్చుకుని చరిత్రను తిరగరాస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: January 12, 2019, 11:49 AM IST
IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌...నెం.1 ర్యాంక్‌పై కన్నేసిన కోహ్లీసేన
వన్డే సిరీస్ ట్రోఫీతో ఆరోన్ ఫించ్, విరాట్ కొహ్లీ ( ICC/ twitter )
news18-telugu
Updated: January 12, 2019, 11:49 AM IST
టెస్ట్‌ల్లో హిస్టారిక్ సిరీస్ విక్టరీ నమోదు చేసిన టీమిండియా ... వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రికార్డ్‌లున్నవి బద్దలు కొట్టడానికే అని భారత జట్టు మరోసారి నిరూపించింది. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లో విరాట్ కొహ్లీ సారధ్యంలోని టీమిండియా సరిగ్గా అదే చేసింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ సేన రెండో స్థానంలో ఉండగా...ఆసీస్ టీమ్ 6వ స్థానంలో ఉంది. సిరీస్ నెగ్గడంతో పాటు ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టును అధిగమించి...తిరిగి టాప్ ర్యాంక్ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా...కంగారూ టీమ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

గత రెండేళ్లలో ఇంగ్లండ్‌ పర్యటనలో మాత్రమే భారత జట్టు వన్డే సిరీస్ ఓడింది. సిడ్నీ‌లో ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ మెల్‌బోర్న్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టెస్ట్‌ జట్టుతో పోల్చుకుంటే ఆరోన్ ఫించ్ సారధ్యంలోని ఆస్ట్రేలియా వన్డే జట్టు బలంగానే ఉంది. తొలి వన్డే కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నారు. 2016లో కంగారూ గడ్డపై చివరిసారిగా జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు 1-4తో చిత్తుగా ఓడింది. ఆ ఓటమికి బదులు తీర్చుకుని చరిత్రను తిరగరాస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వన్డే సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, ధోనీ, కేదార్ జాదవ్, కె ఎల్ రాహుల్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్య.










ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్:
12 జనవరి, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి వన్డే
15 జనవరి, అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా రెండో వన్డే
18 జనవరి, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో వన్డే


ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గి....చరిత్ర సృష్టించిన భారత జట్టుకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నెగ్గడం పెద్ద సవాల్ కాదు. ఆస్ట్రేలియా కంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టుకే వన్డే సిరీస్ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు