హోమ్ /వార్తలు /క్రీడలు /

Rohit Sharma Captaincy : రోహిత్ శర్మకు కోహ్లీ చిన్ననాటి కోచ్ స్ట్రాంగ్ వార్నింగ్.. కెప్టెన్సీపై విమర్శలు..

Rohit Sharma Captaincy : రోహిత్ శర్మకు కోహ్లీ చిన్ననాటి కోచ్ స్ట్రాంగ్ వార్నింగ్.. కెప్టెన్సీపై విమర్శలు..

Rohit Sharma Captaincy : శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి జట్టును నడిపించనున్నాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్‌తో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ మారనున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి ...

  రోహిత్ శర్మ (Rohit Sharam) సారథ్యంలో టీమిండియా (Team India) దూసుకుపోతుంది. లిమిటెట్ ఓవర్ల క్రికెట్ లో టీమిండియా విండీస్, శ్రీలంక జట్లను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీనీ టీమిండియా మాజీ క్రికెటర్లు, విదేశీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. అయితే, విరాట్ కోహ్లీ (Virat Kohli) చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీపై పెదవి విరిచారు. ఓ వైపు రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసిస్తూనే మరోవైపు భవిష్యత్తులో కష్టాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం జట్టులో చేస్తున్న ప్రయోగాలు అంత మంచిది కాదని, భవిష్యత్తులో కష్టాలను తెచ్చిపెడతాయని చెప్పుకొచ్చాడు. ఇలానే ప్రయోగాలను కొనసాగిస్తే ఆస్ట్రేలియా వేదికగా జరిగే అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌కు టీమ్ సిద్దం కాదని తెలిపాడు. సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్న అనంతరం.. టీమిండియా పగ్గాలను అందుకున్న రోహిత్.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో సాధించిన విజయాలను తేలికగా తీసిపారేసాడు.

  " రోహిత్ శర్మ ప్రశాంతమైన కెప్టెన్. అతని సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంటుంది. కాకపోతే రోహిత్‌ సారథ్యంలో టీమిండియా ఇంకా సెట్‌ అవ్వలేదు. ప్రతి సిరీస్‌కు జట్టును మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నారు.ఇలా చేస్తే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ నాటికి జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారు అవుతుంది. ఇటీవల కాలంలో ఒక్కో ఆటగాడు ఒక్కో సిరీస్‌లో రాణించాడు. ఇలా రాణించిన ఆటగాళ్లను రెస్ట్‌ పేరుతో పక్కకు పెట్టడం సబబు కాదు.

  ఇది ఇలానే కొనసాగితే రోహిత్ శర్మకు కష్టాలు తప్పవు. ఇలా ప్రయోగాలు చేసుకుంటూ పోతే, ఏదో ఒక సిరీస్‌లో జట్టుకు తీరని నష్టం జరుగుతుంది. అప్పుడు రోహిత్‌కు అసలు సిసలు సవాల్ ఎదురవుతుంది. టీమ్ ఓపెనర్ల విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఒక్కో సిరీస్‌కు ఒక్కో ప్లేయర్‌తో రోహిత్ ఓపెనింగ్ చేశాడు. టీమ్ ఇంకా సెట్ అవ్వలేదని చెప్పడానికి ఇలాంటి ఉదహారణలు చాలా ఉన్నాయి." అని రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు.

  చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మతో విరాట్ కోహ్లీ.

  గతంలో కూడా విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రాజ్ కుమార్ శర్మ బీసీసీఐపై ఫైరయ్యారు. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడిని బీసీసీఐ అవమానించిందంటూ విమర్శలు చేశాడు. ఎక్కడ కోహ్లీ కెప్టెన్సీ రికార్డులు బద్దలు కొడతాడో అన్న కుళ్లుతో సౌరవ్ గంగూలీ ఇదంతా చేశారని విమర్శించారు.

  ఇది కూడా చదవండి : పుజారా, రహానేలతో పాటు శిఖర్ ధావన్, హార్దిక్ లకు గట్టి షాకిచ్చిన బీసీసీఐ.. సిరాజ్ కు మాత్రం..

  మరోవైపు, శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి జట్టును నడిపించనున్నాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్‌తో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ మారనున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  ఫస్ట్ టెస్టుకి భారత తుది జట్టు అంచనా :

  రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌ (వికెట్ కీపర్‌), హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ /జయంత్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌

  First published:

  Tags: Cricket, India vs srilanka, Rohit sharma, Team India, Virat kohli

  ఉత్తమ కథలు