విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ ఊడిపోతుందని, కేవలం అతడిని టెస్టులకు కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. వన్డేలు, టీ 20ల కోసం కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు (Rohit Sharma) అప్పగిస్తారంటూ వచ్చిన వార్తలపై బీసీసీఐ (BCCI) స్పందించింది. విరాట్ కోహ్లీనే అన్ని ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా కొనసాగుతాడని కుండబద్దలు కొట్టింది. ఇటీవల విరాట్ కోహ్లీ ప్రదర్శన మెరుగ్గా లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఎన్నో కీలక సందర్భాల్లో ఆదుకున్న కెప్టెన్ ఈ సారి అంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడని.. జట్టును ముందుకు నడపడం మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) వరకు అతడిని కెప్టెన్‌గా కొనసాగించి.. ఆ తర్వాత వన్డేలు, టీ 20లకు కొత్త కెప్టెన్‌ను తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. టీ 20 తర్వాత కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించి కేవలం టెస్ట్ కెప్టెన్‌గా పరిమితం చేస్తారన్న వార్తలను కొట్టిపడేశారు. విరాట్ కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు నాయకుడిగా ఉంటాడని కుండబద్దలు కొట్టారు.
‘విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు నిరాధారం. అంతా తప్పు. అలాంటిదేం జరగదు. ఇదంతా మీడియా సృష్టి. అసలు దీనికి సంబంధించి ఎలాంటి చర్చ బీసీసీఐలో జరగలేదు.’ అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ సారధ్యంలో టీమిండియా 45 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 27 సార్లు విజయం సాధించింది. అలాగే 95 వన్డే మ్యాచ్‌లు ఆడగా, 65 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
ఈనెల 19 నుంచి ఐపీఎల్ సెకండ్ హాఫ్ జరగనుంది. అది అయిపోయాక అక్టోబర్ 17 నుంచి టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 14 వరకు టీ 20 సమరం జరగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది.
అక్టోబర్ 24న భారత్ తమ తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది. సూపర్ 12 గ్రూప్ 2లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. గ్రూప్ 2లో ప్రస్తుతం పాకిస్తాన్, న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్ ఉన్నాయి. క్వాలిఫయింగ్ రౌండ్లో గెలిచిన మరో రెండు జట్లు ఇందులో చేరతాయి.
నవంబర్ 10న అబుదాబిలో మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. నవంబర్ 11న రెండో సెమీఫైనల్ జరగనుంది. నవంబర్ 14న ఫైనల్ ఫైట్‌కు డేట్ ఫిక్స్ చేశారు. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కూడా ఉంచారు. ఇటీవలే టీ10 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ కెప్టెన్సీలో 15 మందిని ఎంపిక చేసింది. అయితే, అనూహ్యంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Rohit sharma, Virat kohli