Home /News /sports /

VIRAT KOHLI WIFE ANUSHKA SHARMA SHARES CYCLING VIDEO WITH DAUGHTER VAMIKA VIDEO GOES VIRAL SRD

Viral Video : ప్రియమైన వారిని ఎక్కించుకుని సైకిల్ తొక్కిన అనుష్క శర్మ.. వీడియో వైరల్..

అనుష్క శర్మ (Instagram/Photo)

అనుష్క శర్మ (Instagram/Photo)

Viral Video : ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క, కూతురు వామికలతో కలిసి మాల్దీవుల (Maldives) హాలీడే వెళ్లిన సంగతి తెలిసిందే. మాల్దీవుల నుంచి కోహ్లీ, అనుష్క శర్మలు తాము ఎంజాయ్ చేసిన ఫోటోల్ని అభిమానుల కోసం పంచుకున్నారు.

ఇంకా చదవండి ...
    విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) జంట మీడియా ప్రపంచంలో ఓ హిట్ పెయిర్. సోషల్ మీడియా (Social Media)లో ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. విరాట్ కోహ్లీ కానీ లేదా అనుష్క శర్మ ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేసుకున్నారంటే.. అది క్షణాల్లో వైరల్ అవడమే కాదు.. క్షణాల వ్యవధిలో మిలియన్స్ కొద్ది లైక్స్, వ్యూస్, షేర్స్ వచ్చిపడుతుంటాయి. అలానే, ఇప్పుడు ఓ వీడియో వైరలవుతోంది. ఈ వీడియోను అనుష్క శర్మ తన ఇన్ స్టా అకౌంట్ నుంచి షేర్ చేసింది. ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క, కూతురు వామికలతో కలిసి మాల్దీవుల (Maldives) హాలీడే వెళ్లిన సంగతి తెలిసిందే. మాల్దీవుల నుంచి కోహ్లీ, అనుష్క శర్మలు తాము ఎంజాయ్ చేసిన ఫోటోల్ని అభిమానుల కోసం పంచుకున్నారు. ముఖ్యంగా అనుష్క శర్మ బ్లాక్, ఆరెంజ్ కలర్ స్విమ్ డ్రెస్సుల్లో హాట్ గా కన్పించింది.

    ఆ ఫోటోలు పంచుకున్న అనుష్క ఇప్పుడు అందమైన ఓ వీడియోను షేర్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిసార్ట్ చుట్టూ సైక్లింగ్ చేస్తున్న వీడియో క్లిప్‌ను పంచుకుంది. వీడియోలో.. తన గారాల పట్టి వామికను తీసుకువెళుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇందులోనూ వామిక ముఖం కన్పించలేదు.ఈ వీడియోలో అనుష్క శర్మ గార్డెన్ ఏరియా మరియు రిసార్ట్‌లోని బీచ్‌లో సైక్లింగ్ చేస్తుంది.



    ఆమె వివిధ బీచ్‌వేర్‌లలో కన్పించింది. వీడియోలో ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో క్యాప్షన్ ద్వారా ఆమె ఆనందాన్ని కూడా అంచనా వేయెచ్చు. తన భర్త విరాట్ కోహ్లీ, కూతురు వామికతో హాలీడేలో ఎంజాయ్ చేసిన మధుర జ్ఞాపకాలను పంచుకుంది.ఈ వీడియోను పంచుకుంటూ "నా ఇద్దరు ప్రియమైన వారితో మంచి జ్ఞాపకాలు..నేను తిరిగి సైకిల్ తొక్కతున్నాను "అని క్యాప్షన్ రాసుకొచ్చింది అనుష్క శర్మ. అలాగే.. మాల్దీవుల్ని జ్ఞాపకాల్ని మిస్సవుతున్నట్టు పేర్కొంది. అనుష్క యొక్క ఈ వీడియో ఆమె అభిమానులకు విపరీతంగా నచ్చింది. అందుకే ఈ వీడియోకు లైకుల వర్షం కురిపించింది. చాలా మంది హార్ట్ ఎమోజీలను సెండ్ చేశారు.



    ఇక, మాల్దీవుల్లో అనుష్క శర్మ బ్లాక్ స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలను పంచుకుంటూ, "సూర్యుడు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు" అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే, ఆరెంజ్ కలర్ మోనికినిలో కూడా దర్శనమిచ్చింది. ఇలా మాల్దీవుల నుంచి అనుష్క పంచుకున్న ఫోటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

    ఇది కూడా చదవండి : ఏంది పంత్ ఇదీ!. సిల్లీగా ఆలోచించడం మాను.. లేదంటే అస్సాం ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది

    సినిమాల విషయానికొస్తే.. అనుష్క శర్మ చివరిసారిగా ఆనంద్ ఎల్ రాయ్ యొక్క జీరోలో షారుక్ ఖాన్ మరియు కత్రినా కైఫ్‌లతో కలిసి కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇక, ఈ బ్యూటీ 'చక్దా ఎక్స్‌ప్రెస్' సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రాబోతోంది. ఈ సినిమా భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అనుష్క శర్మ చాలా కష్టపడుతోంది. బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. ఝలన్ గోస్వామిలా మారడానికి ప్రయత్నిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Anushka Sharma, Bollywood, Cricket, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు