VIRAT KOHLI WHAT DID KOHLI SAY IN THE DRESSING ROOM 24 HOURS BEFORE ABOUT RETIREMENT EVK
Virat Kohli: రిటైర్మెంట్ గురించి 24 గంటల ముందు డ్రెసింగ్ రూంలో కోహ్లీ ఏం చెప్పాడు!
Virat Kohli
Virat Kohli resigns as Test captain | టీమిండియా (Team India)టెస్ట్ సారధి విరాట్ కోహ్లి (Virat Kohli)సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ (Twitter) వేదికగా శనివారం ప్రకటించాడు. ఈ సందర్భంగా 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ ప్రకటనకు 24 గంటల ముందు కోహ్లీ డ్రెసింగ్ రూం సభ్యులతో తన అభిప్రాయాలను పంచుకొన్నారు.
Virat Kohli resigns as Test captain: టీమిండియా (Team India)టెస్ట్ సారధి విరాట్ కోహ్లి (Virat Kohli)సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ (Twitter) వేదికగా శనివారం ప్రకటించాడు. ఈ సందర్భంగా 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన బీసీసీఐ (BCCI)కి సైతం థ్యాంక్స్ చెప్పాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. దీంతో టీం ఇండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే కోహ్లీ శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఓడిపోయిన కొన్ని గంటల తర్వాత.. న్యూలాండ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత జట్టు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు వారికి చెప్పాడు.
దీంతో ఒక్క సారిగా డ్రెసింగ్ రూమ్ (Dressing Room) లో ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ప్రకటన చేసిన తరువాత "నేను ఒక చిన్న సహాయం అడుగుతున్నాను, దయచేసి డ్రెస్సింగ్ రూమ్ వెలుపల ఎవరితోనూ ఈ విషయం పంచుకోవద్దు" అని విరాట్ కోహ్లీ చెప్పినట్లు డ్రెసింగ్ రూం సమావేశంలో ఉన్నవారు చెప్పారు.
దాదాపు 24 గంటల తర్వాత, శనివారం సాయంత్రం, గతంలో మాదిరిగానే, కోహ్లి సోషల్ మీడియాలో వార్తలను పంచుకున్నాడు. "ఏదో ఒక దశలో ప్రతిదీ ఆగిపోవాలి మరియు భారత టెస్ట్ కెప్టెన్‌గా నాకు, అది ఇప్పుడు". అంటూ తన భావాలను వెల్లడించాడు. ఈ ప్రకటనతో టీం ఇండియాలో కెప్టెన్‌గా కోహ్లీ ప్రయాణం ముగిసింది. ఇప్పటికే కోహ్లీ T20I కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత ODI నాయకత్వం నుంచి అతనిని తొలగించాలని సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
రవిశాస్త్రి నిష్క్రమణతో..
కేప్ టౌన్లో భారత్ సిరీస్ ఓటమి తర్వాత, మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో, కోహ్లీ చాలా నిరాసక్తతగా కనిపించాడని విలేకరులు చెబుతున్నారు. రోహిత్ శర్మ (Rohit Sharma) ను వండే, టీ20 కెప్టెన్‌గా నియమించడం, టెస్ట్ వైస్ కెప్టెన్సీకి అతని ప్రమోషన్‌తో భారత క్రికెట్లో మార్పులు విరాట్‌పై బాగా ప్రభావం చూపాయి. దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు, కెప్టెన్సీ విషయంలో బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బహిరంగంగా వ్యతిరేకిస్తూ బీసీసీఐ నిర్ణయంపై మాట్లాడారు. అంతే కాకుండా భారత జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి నిష్క్రమణ తర్వాత, కోహ్లి కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో తన అతిపెద్ద మద్దతుదారుని కోల్పోయాడు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.