హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat kohli viral news: మటన్ రోల్స్ కోసం వెళ్లిన కోహ్లీని వెంటాడిన దుండగులు.. షాకింగ్ విషయాలు చెప్పిన అండర్19 సహచరుడు

Virat kohli viral news: మటన్ రోల్స్ కోసం వెళ్లిన కోహ్లీని వెంటాడిన దుండగులు.. షాకింగ్ విషయాలు చెప్పిన అండర్19 సహచరుడు

Virat kohli viral news: టీమిండియా (Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఆసక్తికర విషయాలను అతడి అండర్ 19 టీమ్ మేట్ ప్రదీప్ సంగ్వాన్ షేర్ చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన ఓ చేదు సంఘటను గుర్తు చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

Virat kohli viral news: విరాట్ కోహ్లీ (ViratKOHLI) ఫిట్ నెస్ ఫ్రీక్ గా మనందరికీ తెలుసు. ఫిట్ నెస్ కోసం కఠినమైన కసరత్తులను చేయడంతో పాటు స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో అవుతాడు. టీమిండియా (Team India) లో ఫిట్ నెస్ స్టాండర్స్ పెంచిన ఘనత కూడా కోహ్లీకే చెందుతుంది. అతడిని చూసి తాము కూడా తమ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పలువురు భారత (India) ఆటగాళ్లు కూడా పేర్కొన్నారు. అయితే టీమిండియాలోకి వచ్చిన కొత్తలో విరాట్ కోహ్లీ చబ్బీగా ఉండేవాడు. కానీ 2012లో తన ఆహారపు అలవాట్లను మార్చిన కోహ్లీ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. వ్యాయామాలు చేస్తూ ఎప్పుడూ ఫిట్ గా ఉండేలా కష్టపడుతున్నాడు.

తాజాగా విరాట్ కోహ్లీ గురించి అతడి అండర్-19 టీమ్ మేట్ ప్రదీప్ సంగ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ’ద ఇండియన్ ఎక్స్ ప్రెస్‘కు రాసిన ఒక వ్యాసంలో  2008 అండర్-19 ప్రపంచకప్ (ICC Under 19 World Cup) కంటే కూడా ముందు జరిగిన ఓ సంఘటను గుర్తు చేసుకున్నాడు.

’జూనియర్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ నా రూమ్ మేట్. దాదాపు  ఏడెనిమిదేళ్ల పాటు మ్యాచ్ లు జరిగే సమయాల్లో మేమిద్దరం ఒకే రూంలో ఉండేవాళ్లం. విరాట్ కోహ్లీ ఫుడీ. ఫుట్ అంటే అతడికి చాలా ఇష్టం.  ముఖ్యంగా కోహ్లీకి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కూర్మా రోల్స్, చికెన్ రోల్స్ ఇలా కనిపించిన ప్రతి ఐటెంను తినాలనుకుంటాడు. ఓసారి మేం అండర్ 19 టీంతో కలిసి దక్షిణాఫ్రికా (South africa)లో ఉన్నాం. కోహ్లీతో ఒకరు అక్కడికి కొద్ది దూరంలో రుచికరమైన మటన్ రోల్స్ దొరుకుతాయని చెప్పారు. అంతే వాటిని ఎప్పుడెప్పుడు తినాలా అని కోహ్లీ ఆలోచించడం మొదలు పెట్టాడు. అయితే ఆ మటన్ రోల్స్ జరిగే చోటు అంత సురక్షితం కాదు. కొన్ని రోజులకు ముందే అక్కడ పెద్ద గొడవ జరిగిందని, కత్తులతో ఒకరి మీద మరొకరు దాడి చేసుకున్నారని మా టీం డ్రైవర్ మాతో చెప్పాడు. ఆ మాటలు వినగానే నాకు భయం వేసింది. అయితే కోహ్లీ మాత్రం మనం వెళ్లాల్సిందే అని పట్టు పట్టాడు. నాకు భయం వేస్తుంది వద్దంటున్నా నన్నూ తనతో అక్కడికి తీసుకెళ్లాడు. మేం అక్కడికి వెళ్లి ఆ రుచికరమైన మటన్ రోల్స్ తిన్నాం.  అయితే మా హోటల్ రూంకు తిరుగు ప్రయాణం అయినప్పుడు.. ఆ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు మా కారును వెంబడించారు. ఈ విషయాన్ని గమనించి మేం కారును వేగంగా తోలుతూ ఎక్కడా ఆపకుండా రూంకు చేరుకున్నాం. అదో విచిత్రమై అనుభూతి‘ అంటూ నాటి సంఘటను గుర్తు చేసుకున్నాడు.

అయితే కోహ్లీ సీనియర్ జట్టుకు అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడని, ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనరచినట్లు సంగ్వాన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా బెస్ట్ ఫీల్డర్ గా మారేందుకు అతడు తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసుకున్నాడని సంగ్వాన్ కోహ్లీ గురించి తన ఆర్టికల్ లో పేర్కొన్నాడు.

First published:

Tags: ICC Under 19 World Cup, India, South Africa, Team India, Virat kohli

ఉత్తమ కథలు