• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • VIRAT KOHLI TOOK ON THE CRITICS OF THE PITCH FOR THE PREVIOUS MATCH AND HE SAYS TEAMS PLAY TO WIN AND NOT TAKE THE GAME TO FIVE DAYS SRD

Virat Kohli : గెలుపు కోసమే ఆడతాం..ఐదు రోజులు పాటు వినోదం అందించ‌డానికి కాదు...

Virat Kohli : గెలుపు కోసమే ఆడతాం..ఐదు రోజులు పాటు వినోదం అందించ‌డానికి కాదు...

Virat Kohli

Virat Kohli : నరేంద్ర మోదీ స్డేడియంలో జరిగిన పింక్ టెస్ట్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యం సాధించింది. అయితే, మ్యాచ్ జరిగిన మొతేరా పిచ్ పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో పాటు..బ్రిటీష్ మీడియా కూడా విమర్శలు చేస్తోంది.

  • Share this:
    నరేంద్ర మోదీ స్డేడియంలో జరిగిన పింక్ టెస్ట్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యం సాధించింది. అయితే, మ్యాచ్ జరిగిన మొతేరా పిచ్ పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో పాటు..బ్రిటీష్ మీడియా కూడా విమర్శలు చేస్తోంది. అది స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ అని, టెస్టు క్రికెట్‌కు ఇలాంటి వికెట్‌ను తయారు చేయొద్దని అంటున్నారు. ఇక, మూడో టెస్ట్‌కు వాడిన పిచ్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్రంగా మండిప‌డ్డాడు. ఐదు రోజులూ మ్యాచ్ సాగాల‌ని ఆడ‌తారా లేక గెల‌వాల‌ని ఆడ‌తారా అని అత‌డు ప్ర‌శ్నించాడు. నాలుగో టెస్ట్‌కు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లి.. పిచ్ గురించే వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధాన‌మిచ్చాడు. ఎప్పుడూ స్పిన్ పిచ్‌ల‌పైనే ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని కోహ్లి అన్నాడు. మ‌న మీడియా కూడా ఉప‌ఖండంలో స్పిన్ పిచ్‌ల‌కే స‌రైన‌వ‌న్న దృక్ప‌థంతో ఉండాల‌ని సూచించాడు. "మేము ఈ స్థాయి స‌క్సెస్ సాధించ‌డానికి కార‌ణం.. మేము ఆడిన ఏ పిచ్‌నూ విమ‌ర్శించ‌లేదు. మ‌మ్మ‌ల్ని మేము మెరుగు ప‌ర‌చుకోవ‌డానికే ప్ర‌య‌త్నించాం. న్యూజిలాండ్‌లో మేము మూడు రోజుల్లోనే ఓడిన‌ప్పుడు కూడా ఎవ‌రూ ఇలా రాయ‌లేదు అని కోహ్లి అన్నాడు. ఎప్పుడూ స్పిన్ పిచ్‌ల‌నే విమ‌ర్శిస్తారు. సీమింగ్ పిచ్‌ల‌పై బంతి విప‌రీతంగా స్వింగై జ‌ట్లు 40-50కి ఆలౌటైన‌ప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌రు" అని కోహ్లి విమ‌ర్శించాడు.

    పిచ్‌లు ఎప్పుడూ హోమ్ టీమ్‌కే అనుకూలంగా ఉంటాయ‌ని భావించాలా అని అడిగిన ప్ర‌శ్న‌కు.. మేము ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ల‌లో ఉన్న‌ప్పుడు ఈ ప్ర‌శ్న అడిగితే బాగుంటుంది. ఇప్పుడు స్పిన్ ట్రాక్‌ల‌పై రెండు మ్యాచ్‌లు గెలిచిన త‌ర్వాత అడ‌గ‌టం స‌రికాదు అని కోహ్లి అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లు రెండు, మూడు రోజుల్లో ముగియ‌కుండా ఉండాలంటే ఏం చేయాల‌ని ప్ర‌శ్నించ‌గా.. మ్యాచ్‌లు గెల‌వ‌డానికి ఆడ‌తాము త‌ప్ప ఐదు రోజులు పాటు వినోదం అందించ‌డానికి కాదు అని కోహ్లి స్ప‌ష్టం చేశాడు.

    ఇక రేపటి నుంచి అదే న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్పటికే టీమిండియా సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు