ఈ జ్ఞాపకం ఎంత మధురం.. చాహాల్‌కు పెళ్ళి... హార్థిక్ పాండ్యాకు కొడుకు

cricketers wifes (1)

2020 సంవత్సరం మనకి మధురం కంటే చెదునే ఎక్కువగా మిగిల్చింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పౌర సమాజం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సామన్యుడి నుంచి మెుదలుకుని సెలబ్రెటీల వరకు అందర్ని

 • Share this:


  2020 సంవత్సరం మనకి మధురం కంటే చెదునే ఎక్కువగా మిగిల్చింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పౌర సమాజం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సామన్యుడి నుంచి మెుదలుకుని సెలబ్రెటీల వరకు అందర్ని ఈ మహమ్మారి ఓ ఆట ఆడుకుంది. ఆటలు ఆగాయి,వ్యాపారం దెబ్బతింది,ప్రయాణాలు ఆగిపోయాయి. పపంచం మెుత్తం ఓ మూలన కూర్చుండి పోయింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. దీంతో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఉరుకుల.పరుగుల జీవితానికి కాస్త బ్రేక్ పడింది. బమటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం కారణంగా చాలా మంది సోషల్ మీడియాకు పని చెప్పారు. వారి ఆలోచనలకు,వారి పనులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. ముఖ్యంగా క్రికెటర్లు ఇంట్లో ఉండి వారి చేసిన ఫన్నీ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు.


  డాన్స్‌లతో ఇరగతీసిన వార్నర్

  కరోనా సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫాంను డేవిడ్ వార్నర్ వాడినంతంగా మరెవరో వాడలేదోమో. ఫ్యామీలీతో కలిసి సరాదగా డాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు వినోదాన్ని పంచారు. తెలుగు పాటలు డాన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నారు. టాలీవుడ్‌లో హిట్ ట్రాక్స్‌కు డాన్స్ చేసి టిక్‌టాక్‌‌లో పోస్ట్ చేసి అలరించారు. ముఖ్మంగా అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ, రాములో రాములా,సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్‌ పాటలకు స్టెప్పులు వేసి సూపర్ అనిపించారు.


   కూతురితో  రోహిత్ 

  లాక్‌డౌన్ సమయంలో హిట్‌మ్యాన్ కూడా ఫ్యామిలీతో కలిసి బాగానే ఎంజాయి చేశారు. విదేశీ క్రికెటర్లతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ముచ్చటించాడు. తన ముద్దుల కూతురు సమైరాతో కలిసి సరాదగా గడిపారు.


  చాహల్‌ పెళ్లి కబుర్లు

  ఈ ఏడాది యుజువేంద్ర చాహల్‌కు మరిచిపోలేని మధుర సృతులను పంచింది. తన జీవిత భాగస్వామిని లాక్ డౌన్ ఖాళీ సమయంలోనే కలిశాడు. యూట్యూబర్‌ ధనశ్రీతో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహం చేసుకున్నాడు. వీటికి సంబంధించిన ఫోటలను సోషల్ మీడియాలో షేరు చేసి ఉత్సాహంగా గడిపాడు.


  హార్దిక్‌ పాండ్యకు 2020 ఎంతో స్పెషల్

  హార్దిక్‌ పాండ్యకు ఈ ఏడాది బాగా కలిసోచ్చింది. తన జీవిత భాగస్వామిగా నటాషా స్టాంకోవిచ్‌ను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రిగా అతని 2020 మధుమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది. లాక్‌డౌన్‌ సమయాన్ని హార్దిక్ ఎంతోగానో ఆస్వాదించాడు. ఖాళీ సమయంలో తన ఫిట్‌నెస్ మెరుగుపర్చుకున్నాడు. గర్భం దాల్చిన సమయంలో భార్య ప్రతి క్షణం భార్యతోనే ఉన్నాడు. 2020లో భర్తగా, తండ్రిగా బాధ్యతలు స్వీకరించాడు.


  సంజు శాంసన్ సాధన

  యువ క్రికెటర్ సంజు శాంసన్ లాక్‌డౌన్‌లో సమయంలో తన ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టిపెట్టారు. ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నారు కోచ్ వద్ద బ్యాటింగ్‌లో మెళుకువలు నేర్చుకుని ఐపీఎల్ రాణించి.. టీమిండియాలో సుస్థిర స్థానం కోసం ప్రయత్నించారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.
  Published by:Rekulapally Saichand
  First published: