దారుణం! ఆ లిస్టులో కోహ్లీ ఒక్కడే...

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ - 100 జాబితాలో 83వ స్థానాన్ని పొందాడు భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ.

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2018, 6:27 PM IST
దారుణం! ఆ లిస్టులో కోహ్లీ ఒక్కడే...
విరాట్ కోహ్లీ
  • News18
  • Last Updated: June 6, 2018, 6:27 PM IST
  • Share this:
మనదేశంలో కుబేరులకి కొదువే లేదు. ఫోర్బ్స్ టాప్ - 10 జాబితాలో మనవాళ్లు కచ్చితంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల లిస్టులోనూ బాలీవుడ్ హీరోలకి స్థానం ఉంటుంది. అయితే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల లిస్టులో మాత్రం మనదేశం నుంచి కేవలం ఒకే ఒక్క క్రికెటర్ కి చోటు దక్కింది. అది కూడా టాప్ - 10 లోనో, టాప్ - 20లోనో కాదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ - 100 జాబితాలో 83వ స్థానాన్ని పొందాడు భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ.

గత ఏడాది 24 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిన విరాట్ కోహ్లీ, దేశంలో అత్యధిక సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. అంటే అక్షరాలా 160 కోట్ల 54 లక్షల 80 వేల రూపాయలకు పైగా. అయితే కోహ్లీ సంపాదనలో 4 మిలియన్ డాలర్లు మాత్రమే క్రికెట్ వేతనంగా వచ్చింది. మిగిలిన 20 మిలియన్లు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా వచ్చిందే. కోహ్లీ కంటే ముందు టీమిండియాకు సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, రిటైర్మెంట్ తర్వాత కూడా ఎండార్స్ మెంట్స్ విషయంలో దూసుకుపోతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ లకు కూడా ఈ లిస్టులో చోటు దక్కకపోవడం విశేషం.

టాప్ - 100 లిస్టులో చోటు దక్కించుకున్న  ఒకే  ఒక్క క్రికెటర్ కూడా కోహ్లీయే.


విరాట్ కోహ్లీ


అమెరికన్ బాక్సర్ ఫ్లోయర్డ్ మేవెదర్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతనికి ఒకే ఒక్క మ్యాచ్ ద్వారా 275 మిలియన్ల డాలర్లు రాగా, ఎండార్స్ మెంట్ల ద్వారా మరో 10 మిలియన్లు ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో అర్జెంటినా ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ఉన్నాడు. మెస్సీ ఆదాయం 111 మిలియన్ డాలర్లు. మూడో స్థానంలో పోర్చ్ గీస్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్లో 108 మిలియన్ డాలర్లతో ఉన్నాడు. మొదటి మూడు స్థానాల మొత్తం ఆదాయమే 3.8 బిలయన్ డాలర్లు ఉండడం విశేషం. ఇది గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరిగింది.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ జాబితాలో అమెరికన్ అథ్లెట్ల ఆధిపత్యమే కనిపించింది.  ఈ లిస్టులో విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కడం చూస్తుంటే మనదేశంలో క్రీడాకారులకు చెల్లిస్తున్న వేతనాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థమవుతోంది.
Published by: Ramu Chinthakindhi
First published: June 6, 2018, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading