కేక పుట్టించిన కోహ్లీ బాటిల్ క్యాప్ ఛాలెంజ్.. అదిరిపోయేలా రవిశాస్త్రి కామెంటరీ..

Virat Kohli | Battle Cap Challenge | గ్రౌండ్‌లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ.. బ్యాట్‌తో ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బ్యాట్ కొనను బాటిల్ క్యాప్‌కు తగిలేలా చేసి.. మూతను తొలగించాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 12, 2019, 2:09 PM IST
కేక పుట్టించిన కోహ్లీ బాటిల్ క్యాప్ ఛాలెంజ్.. అదిరిపోయేలా రవిశాస్త్రి కామెంటరీ..
విరాట్ కోహ్లీ (Twitter Photo)
  • Share this:
బాటిల్‌పై మూతను కాలితో తొలగించడం.. ప్రస్తుతం హాట్ ట్రెండింగ్‌లో ఉన్న ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ఇది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ తమదైన శైలిలో టాలెంట్‌ను చూపిస్తూ అబ్బురపరుస్తున్నారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ తన బ్యాట్‌తో బాల్‌ను బాది మూతను తొలగించి వహ్వా! అనిపించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతైంది. గ్రౌండ్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ రన్ మెషీన్.. బ్యాట్‌తో ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బ్యాట్ కొనను బాటిల్ క్యాప్‌కు తగిలేలా చేసి.. మూతను తొలగించాడు. ఆ తర్వాత ఆ బాటిల్‌లోని నీళ్లను తాగాడు. ఆ సమయంలో రవిశాస్త్రి చెప్పిన కామెంటరీ మరింత ఆసక్తి కలిగించింది.

దీనికి సంబంధించిన వీడియోను కోహ్లీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. వేలాది రీట్వీట్లు.. లక్షలాది లైకులతో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. కోహ్లీ బ్యాటింగ్ అద్భుతం.. నీ టెక్నిక్ సూపర్.. అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>