సోషల్ మీడియాలో RCB చెత్తపని...ఆటగాళ్లు, కెప్టెన్ కోహ్లీ విస్మయం

ఆర్సీబీ జట్టు రీ-బ్రాండింగ్ పేరుతో సోషల్ మీడియా ఖాతాల్లోని పాత పోస్టులన్నిటినీ తొలగించడం పట్ల ఆ జట్టు ఆటగాళ్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ విస్మయాన్ని వ్యక్తంచేశారు. ఐపీఎల్ 2020కి కొన్ని వారాల ముందుగా చోటు ఆర్సీబీ జట్లులో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని ఆ జట్టు అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

news18-telugu
Updated: February 13, 2020, 10:14 AM IST
సోషల్ మీడియాలో RCB చెత్తపని...ఆటగాళ్లు, కెప్టెన్ కోహ్లీ విస్మయం
విరాట్ కోహ్లీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తీరుపై ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ముత్తూట్ ఫినాన్స్‌ లిమిటెడ్‌తో ఆర్బీసీ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జట్టుకు రీబ్రాండింగ్ చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. దీంతో ఇన్‌స్టాగ్రమ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా అధికారిక ఖాతాల్లోని ఫోటోలన్నిటినీ తొలగించింది. తమ ఫోటోలను సోషల్ మీడియా నుంచి ఆర్సీబీ తొలగించడం పట్ల ఆర్సీబీ ఆటగాళ్లు ఏబీ డీవిల్లిర్స్, యుజ్వేంద్ర చహల్‌తో పాటు తాజాగా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విస్మయాన్ని వ్యక్తంచేశాడు. కెప్టెన్‌కు చెప్పకుండానే సోషల్ మీడియా నుంచి పోస్ట్స్ తొలగించారంటూ అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఏదైనా సహాయం కావాలంటే తనను అడగాలని సూచించాడు.

అంతకు ముందు చహల్ కూడా ఆర్సీబీ సోషల్ మీడియా ఖాతాల నుంచి తమ ఫోటోలను తొలగించడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశాడు. ఏది ఏమి గూగ్లీ అంటూ ప్రశ్నించాడు.సోషల్ మీడియాలో జట్టు ఫోటోలు ఏమయ్యాయంటూ ఏబీ డీవిల్లియర్స్ ప్రశ్నించాడు.పలువురు క్రికెట్ ఆటగాళ్లు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. రీ బ్రాండింగ్ చేయాలంటే సోషల్ మీడియాలో పాత పోస్ట్‌లను తొలగించడం సరైన పద్దతి కాదంటున్నారు. ఈ విషయంలో ఆర్సీబీకి సరైన వ్యూహం కొరవడినట్లుందని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ 2020కి కొన్ని వారాల ముందుగా ఆర్సీబీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల పట్ల ఆ జట్టు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

 
First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు