విరాట్ కోహ్లీ - స్టీవ్ స్మిత్... ఎవరు గొప్ప... సౌరబ్ గంగూలీ ఆన్సర్ ఇదీ...

Virat Kohli vs Steve Smith : తాజాగా ICC ర్యాంకింగ్స్‌లో 937 రేటింగ్ పాయింట్లతో... విరాట్ కోహ్లీ కంటే... 34 పాయింట్లు ముందు నిలిచాడు స్టీవ్ స్మిత్. ఇందుకు కారణం అతను తాజాగా సాధించిన 80, 23 స్కోర్లే.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 9:15 AM IST
విరాట్ కోహ్లీ - స్టీవ్ స్మిత్... ఎవరు గొప్ప... సౌరబ్ గంగూలీ ఆన్సర్ ఇదీ...
స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ
  • Share this:
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ (47) ఇబ్బంది పడిన సందర్భం సోమవారం వచ్చింది. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ ఇద్దర్లో ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆయన ఇష్టపడలేదు. కారణం... ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ప్రపంచంలోనే ది బెస్ట్ అంటూనే... స్టీవ్ స్మిత్‌ గొప్పదనం గురించి అతని రికార్డులే చెబుతున్నాయని అన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్... ICC టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్... స్మిత్‌కు అదనపు పాయింట్లు తెచ్చిపెట్టాయి. అదే సమయంలో... టాప్‌లో ఉండే విరాట్ కోహ్లీ.. సెకండ్ స్పాట్‌లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 937 రేటింగ్ పాయింట్లతో... విరాట్ కోహ్లీ కంటే... 34 పాయింట్లు ముందు నిలిచాడు స్టీవ్ స్మిత్. ఇందుకు కారణం నాలుగు టెస్టుల్లో స్మిత్... 774 పరుగులు చేయడమే. వాటిలో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.

కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. అదెలా చెప్పగలం. పెర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో విరాట్ కోహ్లీ ది బెస్ట్. అది మనకు ఆనందం కలిగించే అంశం. ఇక స్టీవ్ స్మిత్ ఎంత గొప్పవాడో అతని రికార్డులే చెబుతున్నాయి. 26 టెస్ట్ సెంచరీలు... కళ్లముందు కనిపిస్తున్న రికార్డ్.
సౌరబ్ గంగూలీ (కోల్‌కతాలోని ఓ లాంచ్ ప్రోగ్రామ్‍‌లో)


నెక్ట్స్ టీమ్ఇండియా కోచ్ అవ్వాలనేది గంగూలీ ఆలోచన. దీనిపై ప్రశ్నించగా... ముందు ఒక కోచ్ పని కానివ్వండి. తర్వాత నెక్ట్స్ కోచ్ సంగతి చూద్దామన్నాడు నవ్వుతూ.

నేను ఆల్రెడీ కోచ్‌నే. ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌కి కోచ్‌గా ఉన్నాను. గతేడాది నా మొదటి సీజన్‌లో వాళ్లు బాగా ఆడారు. గత ఏడేళ్లలో లేనిది తొలిసారి సెమీఫైనల్ వరకూ వెళ్లారు. అది గొప్ప విషయం.
సౌరబ్ గంగూలీ.


2021 నవంబర్ 24 వరకూ కెప్టెన్‌గా రవిశాస్త్రిని ఇటీవలే మళ్లీ నియమించారు. ప్రస్తుతం గంగూలీ... బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఫ్రాంఛైజీగా, టీమ్ సలహాదారుగా చేస్తున్నాడు. క్రికెట్ కామెంటరీలూ ఇచ్చాడు. బెంగాలీ క్విజ్ షోకి అతడు హోస్ట్‌గా చేశాడు.

ధోని ఫ్యూచర్ సంగతేంటని అడగగా... సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో, విరాట్ ఆలోచన ఏంటో తనకు తెలియదనీ, వాళ్లనే ఆలోచించుకోనిద్దామని తెలివిగా సమాధానం ఇచ్చాడు దాదా. ప్రస్తుతం జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికాను ఓడించే ఫేవరెట్స్ టీమిండియానే అన్నాడు. ఐతే... మొదటి టీ20... హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగాల్సి ఉండగా... వర్షం వల్ల రద్దైంది. రెండో మ్యాచ్ బుధవారం మొహాలీలో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా... ప్రొటీస్‌తో మూడు టెస్టుల సిరీస్ కూడా ఆడనుంది.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading