• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • VIRAT KOHLI START OPEN WITH ROHIT SHARMA IN WORLD CUP WILL OPEN IN IPL SA

Virat Kohli: ఐపీఎల్‌లోనూ నేను ఓపెనింగ్‌ చేస్తా: విరాట్ కోహ్లీ

Virat Kohli: ఐపీఎల్‌లోనూ నేను ఓపెనింగ్‌ చేస్తా: విరాట్ కోహ్లీ

virat kohli and rohit sharma

ఆశ్చర్యంగా శనివారం ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20లో రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ ఓపెనర్స్‌గా బరిలోకి దిగారు. టీమ్‌ఇండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన

  • Share this:


    ఆశ్చర్యంగా శనివారం ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20లో రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ ఓపెనర్స్‌గా బరిలోకి దిగారు. టీమ్‌ఇండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ (64; 34 బంతుల్లో 4x4, 5x4), కోహ్లీ (80నాటౌట్‌; 52 బంతుల్లో 7x4, 2x6) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరు ఇంగ్లీష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటు తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి కీలక భాగస్వామ్యంతో జట్టు విజయానికి గట్టి పునాదులు వేశారు.

    ఈ విషయం స్పందించిన కోహ్లి.. రోహిత్‌ శర్మతో కలిసి కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తానని స్పష్టం చేశాడు. ‘ఇది మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే విజయం. ప్రత్యర్థిపై పూర్తిగా డామినేషన్ చేశాం. పిచ్‌పై తేమ అధికంగా ఉన్నా లక్ష్యాన్ని కాపాడుకున్నాం. పంత్‌, శ్రేయస్‌ బ్యాటింగ్‌ దిగకుండానే 224 పరుగుల భారీ స్కోర్‌ సాధించాం. మా బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహారణ. ఓపెనర్స్‌గా బరిలోకి దిగడంపై మేమిద్దరం సానుకూల దృక్పథంతో ఉన్నాం. నమ్మకంతో బ్యాటింగ్ అరభించి ఒకరు చెలరేగితే, మరొకరు నిలకడగా ఆడాలని అనుకున్నాం. సూర్య, హార్దిక్‌లు తోడ్పాటుతో మరిన్ని పరుగులు రాబట్టం. ‘వచ్చే ఐపీఎల్‌లోనూ ఓపెనింగ్‌ చేస్తా. వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం ఉంది. ఇక నుంచి రోహిత్‌తో ఇన్నింగ్స్ ఆరంభిస్తా.. అని విరాట్‌ చెప్పుకొచ్చాడు.
    Published by:Rekulapally Saichand
    First published: