టీమ్ ఇండియా (Team India) మాజీ టీ20 కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఐసీసీ ర్యాంకుల్లో (ICC Rankings) పెద్ద ఎదరు దెబ్బ తగిలింది. బ్యాటర్ల ర్యాంకుల్లో 18 నెలల తర్వాత టాప్ 10 నుంచి కిందకు దిగిపోయాడు. కోహ్లీ ఏకంగా 8వ ర్యాంకు నుంచి 11వ ర్యాంకుకు పడిపోయాడు. న్యూజీలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరమవడంతో అతడి ర్యాంకు పడిపోయింది. ఇక టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 2 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతడి ర్యాంక్ 13గా ఉన్నది. అయితే టాప్ 10 ర్యాంకుల్లో ఒకే ఒక భారత బ్యాటర్‌కు స్థానం దక్కింది. న్యూజీలాండ్ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా రాణించిన కేఎల్ రాహుల్ (KL Rahul) ఒక స్థానం మెరుగుపరుచుకొని 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు తప్ప టాప్ 10లో మరో భారత బ్యాటర్‌కు స్థానం దక్కలేదు. రోహిత్ శర్మ పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన తొలి సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. అతడు మూడు మ్యాచ్‌లలో 159 పరుగులు చేశాడు.
ఇక బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ తిరిగి టాప్ 10లోకి అడుగుపెట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా 70, 31, 51 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో మూడు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు చేరుకున్నాడు,. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. అయినా సరే అతడే నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ నెంబర్ 4 స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ యువ బ్యాటర్ హైదర్ అలీ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి 184వ ర్యాంకుకు చేరుకున్నాడు.
IND vs NZ: రేపు ఇండియా తరపున అరంగేట్రం చేసేది ఎవరో చెప్పిన అజింక్య రహానే.. సూర్యకుమార్‌కు మొండి చేయి
Details ?https://t.co/tfajkOu3sg
— ICC (@ICC) November 24, 2021
ఇక బౌలింగ్ ర్యాంకుల్లో భువనేశ్వర్ కుమార్ 5 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 129 స్థానాలు ఎగబాకి 92వ ర్యాంకుకు.. అక్షర్ పటేల్ 160 స్థానాలు ఎగబాకి 112వ ర్యాంకుకు చేరుకున్నాడు. న్యూజీలాండ్ పేసర్ మిచెల్ సాంట్నర్ 10 స్థానాలు మెరుగు పరుచుకొని 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. దీపక్ చాహర్ బౌలింగ్ ర్యాంకుల్లో 19 స్థానాలు మెరుగుపరుచుకొని 40వ ర్యాంకుకు.. ఆల్‌రౌండర్ల ర్యాంకులో 163కు చేరుకున్నాడు. బ్యాటర్లలో పాకిస్తాన్‌కు చెందిన బాబర్ అజమ్, బౌలింగ్‌లో శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ, ఆల్ రౌండర్లలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబి టాప్ ర్యాంకులో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ICC, KL Rahul, Rohit sharma, Virat kohli