హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli: తమ్ముడు కోహ్లీ కన్నీళ్లు చూసి తట్టుకోలేక పోయిన అక్క భావనా.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్

Virat Kohli: తమ్ముడు కోహ్లీ కన్నీళ్లు చూసి తట్టుకోలేక పోయిన అక్క భావనా.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్

తమ్ముడి బాధ చూసి తట్టుకోలేకపోయిన భావనా కోహ్లీ.. ఇన్‌స్టాలో పోస్టు (PC: Twitter)

తమ్ముడి బాధ చూసి తట్టుకోలేకపోయిన భావనా కోహ్లీ.. ఇన్‌స్టాలో పోస్టు (PC: Twitter)

Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టును ఎలిమినేటర్‌లో గెలిపించుకోలేక మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. అతడి బాధను చూసి కోహ్లీ అక్క భావనా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్‌ 2021 (IPL 2021) ఎలిమినేటర్‌లో (Eliminator) ఓడిపోయి లీగ్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) నిష్క్రమించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత షార్జా క్రికెట్ స్టేడియంలోనే జట్టంతా ఒక దగ్గర సమావేశమైన సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్ కావడంతో.. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాననే బాధ కోహ్లీ కళ్లల్లో స్పష్టంగా కనపడింది. పక్కనే ఉన్న ఏబీ డివిలియర్స్ కూడా ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతం అయ్యాడు. టీవీల్లో ఈ దృశ్యాలను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ 'అయ్యో కోహ్లీ' అంటూ బాధపడ్డారు. బయటి వ్యక్తులే కోహ్లీ దుఖాన్ని చూసి అంతలా బాధపడితే ఇక సొంత వాళ్లు ఎలా ఫీల్ అయి ఉంటారు. నిజమే.. ఈ దృశ్యాలను చూసిన కోహ్లీ అక్క భావనా కోహ్లీ థింగ్రా చాలా బాధపడిపోయింది. తమ్ముడు కోహ్లీ అలా లక్ష్యాన్ని సాధించలేక ఏడుస్తూ ఉంటే ఆమె కూడా చలించిపోయింది. దూరంగా దుబాయ్‌లో ఉన్న తమ్ముడి కోసం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.

  'తమ్ముడూ.. కెప్టెన్‌గా నువ్వు చేయగలిగినంతా చేశాము. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గొప్పగా రాణించావు. నువ్వు ఎప్పటికీ బెంగళూరు కెప్టెన్‌గా గుర్తుండిపోతావు. అసలు బెంగళూరు కెప్టెన్ అనే పదానికి పర్యాయపదం నువ్వే. నువ్వొక గొప్ప నాయకుడివి. జట్టులో అలాంటి గౌరవం, ప్రశంసలు పొందడానికి తప్పకుండా అర్హత కలిగి ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉన్నది' అని భావన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసింది. ఈ పోస్టు వైరల్ మారింది. ఫ్యాన్స్ కూడా అక్క మాటలకు చలించిపోయారు. భావన తమ్ముడి బాధను అర్థం చేసుకుందని ప్రశంసిస్తున్నారు. ఓటమిలో మన వాళ్లు తోడుంటే బాధను త్వరగా మర్చిపోగలరు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.


  (భావన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీ స్క్రీన్ షాట్)

  కాగా ఢిల్లీకి చెందిన ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకు ముగ్గురు సంతానం. అందులో భావన కోహ్లీ అందరి కన్నా పెద్దది. ఆ తర్వాత వికాస్ కోహ్లీ పుట్టాడు. ఇంట్లో అందరి కంటే చిన్నవాడు విరాట్ కోహ్లీ. అందుకే ఆ ఇంట్లో అందరికీ విరాట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్న ప్రేమ్ కోహ్లీనే విరాట్ లోని టాలెంట్ గుర్తించి గ్రౌండ్‌కు తీసుకొని వెళ్లేవాడు. ఒకసారి మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ తండ్రి చనిపోయిన వార్త వచ్చింది. అతడు ఆ రోజు ఆట ముగిసిన వెంటనే ఢిల్లి వెళ్లి.. తిరిగి మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చ ఆటను కంటిన్యూ చేశాడు. అదీ కోహ్లీకి ఆటపై ఉన్న డెడికేషన్. అందుకే ఓటములు ఎదురైనప్పుడు చాలా భావోద్వేగానికి గురవుతుంటాడు.

  Published by:John Kora
  First published:

  Tags: IPL 2021, Royal Challengers Bangalore, Virat kohli

  ఉత్తమ కథలు