IND vs AUS 1st ODI: విరాట్ విఫలం...4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో భారత్

విరాట్ కొహ్లీ విఫలమవ్వడంతో పాటు రాయుడు, ధావన్ డకౌటవ్వడంతో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది.

news18-telugu
Updated: January 12, 2019, 2:14 PM IST
IND vs AUS 1st ODI: విరాట్ విఫలం...4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో భారత్
విరాట్ కొహ్లీ ఫైల్ ఫోటో ( BCCI/ twitter)
news18-telugu
Updated: January 12, 2019, 2:14 PM IST
సిడ్నీ వన్డేలో 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. 4 పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ కొహ్లీ విఫలమవ్వడంతో పాటు రాయుడు, ధావన్ డకౌటవ్వడంతో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న ఆస్ట్రేలియా పేసర్ జాసన్ బెహ్రన్డార్ఫ్ బౌలింగ్‌లో ధావన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్యూ‌గా భారత ఓపెనర్ వెనుదిరిగాడు.

ఆ తర్వాత వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం విఫలమయ్యాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే అంబటి రాయుడు సైతం డకౌటయ్యాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటై..పెవిలియన్ చేరాడు. దాంతో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.



Loading....



అరంగేట్రం చేసిన వన్డేలో వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన బెహ్రన్డార్ఫ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతుకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమవ్వడంతో ఆతిధ్య జట్టు 300 పరుగులకు పైగా స్కోర్ నమోదు చేయలేకపోయింది. భారత జట్టు బౌలర్లు ఆస్ట్రేలియా ఓపెనర్లు అలెక్స్ క్యారీ, ఆరోన్ ఫించ్‌లను కట్టడి చేసినా ఫలితం లేకుండా పోయింది. పీటర్ హ్యాండ్స్‌కూంబ్(73), షాన్ మార్ష్(54), ఉస్మాన్ ఖవాజా(59) హాఫ్ సెంచరీలతో ఆసీస్ టీమ్ కోలుకుంది. లోయర్ ఆర్డర్‌లో మార్కస్ స్టోయినిస్(47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 288 పరుగులు స్కోరు సాధించింది. చివరి 10 ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మన్లు 93 పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు.
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు