1990లలో విరాట్ కోహ్లీ...ఆసక్తికరమైన ట్వీట్ చేసిన కెప్టెన్

మాంచెస్టర్ వేదికగా పాక్‌తో భారత్ మ్యాచ్ సందర్భంగా వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంపై తన చిన్ననాటి ఫోటోతో జతచేతి లేటెస్ట్ ఫోటోను కోహ్లీ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: June 17, 2019, 6:51 PM IST
1990లలో విరాట్ కోహ్లీ...ఆసక్తికరమైన ట్వీట్ చేసిన కెప్టెన్
విరాట్ కోహ్లీ
  • Share this:
మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పాక్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. అయితే 40 ఓవర్లలో పాక్ ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వర్షం వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఆకాశం వైపు చూస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన చిన్ననాటి ఫోటోతో పాటు పాక్‌తో మ్యాచ్ సందర్భంగా తీసిన ఫోటోలను జతచేసి ట్వీట్ చేశారు. 90ల నుంచి ఇలా చేస్తున్నానని పేర్కొన్నాడు.

 


 
First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు