VIRAT KOHLI SAYS WHEN HE BECAME TEST CAPTAIN TEAM INDIA WERE RANKED 7TH POSITION AND HERE NETIZENS REACTION SRD
Virat Kohli : బాబోయ్.. కోహ్లీ మాములోడు కాదు.. జట్టు మొత్తం పడ్డ కష్టాన్ని తన ఒక్కడి ఖాతాలోనే వేసుకున్నాడుగా..!
Virat Kohli
Virat Kohli : సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు మొత్తం పడ్డ కష్టాన్ని ఇన్ డైరెక్ట్ గా తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్.
టీమిండియా, దక్షిణాఫ్రికాల (India Vs South Africa) మధ్య సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు ఈ నెల 11న మంగళవారం ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితం తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యమిస్తోంది. ఈ సిరీస్ లో సెంచురియన్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా(Team India) 113 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ 1-1తో సమం చేసింది. దీంతో.. ఇప్పుడందరి దృష్టి మూడో టెస్టుపై పడింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే, సౌతాఫ్రికాతో మూడో టెస్ట్‌కు తాను సిద్దంగా ఉన్నానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. " సౌతాఫ్రికా వికెట్లపై కేఎల్ రాహుల్ ప్రయత్నాలు అద్భుతమైనవి.. కానీ, దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసింది. రాహుల్ చేసిన ప్రయత్నాలన్నీ తాను చేశాడు. కొత్తగా చేయడానికి అక్కడే ఏమీ లేదన్నాడు కోహ్లీ.. రెండో టెస్టుకు తాను అందుబాటులో ఉండి ఉంటే.. మరో వ్యూహం ఏదైనా ప్రయత్నించి ఉండేవాడిని కావొచ్చు. ఏది ఏమైనా ఎవరి కెప్టెన్సీ వారిది " అని కోహ్లీ కామెంట్స్ చేశాడు.
తన ఫిట్ నెస్ విషయంపై అడిగిన ప్రశ్నకు .. నేను పూర్తి ఫిట్ నెస్ సాధించాను… కేప్ టౌన్ టెస్టుకు అందుబాటులోకి వస్తానని కోహ్లీ తెలిపాడు.మరోవైపు.. టీమిండియా సాధించిన క్రెడిట్ ను ఇన్ డైరెక్ట్ గా తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. తాను కెప్టెన్సీ చేపట్టే సమయంలో టీమిండియా ఏడో ర్యాంకులో ఉండేదని.. కానీ.. ఇప్పుడు నెం.1 గా మారిందని చెప్పాడు. తాను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత నాలుగు ఏళ్లు నుంచి టీమిండియానే నెం.1 గా ఉందన్నాడు.
దీంతో, కోహ్లీ వ్యాఖ్యలపై కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. జట్టు మొత్తం పడ్డ కష్టాన్ని.. తన ఒక్కడి ఖాతాలో క్రెడిట్ చేసుకోవడం మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘనతను జట్టు మొత్తం సాధించిందని.. కోహ్లీ ఒక్కడే కాదని గుర్తించుకోవాలని సూచించారు.
ఇక సీనియర్ బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఫామ్‌లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ.. ‘‘జట్టులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి సహజంగా జరగాలే గానీ.. బలవంతంగా మార్పులు చేయకూడదు. ఎప్పుడూ ఆటగాళ్ల రికార్డులు, నంబర్స్, మైలురాళ్ల ఆధారంగా తీర్పునిస్తారు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఆటగాళ్లు రాణించిన ప్రాముఖ్యతను గుర్తించాలి.''అని అన్నాడు. మూడో టెస్టు నేపథ్యంలో రహానే, పుజారా తుది జట్టులో ఉంటారని చెప్పకనే చెప్పాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.