VIRAT KOHLI SAYS LOVE TO LEARN TO CHANGE DIAPERS TEAM INDIA CAPTAIN SHEDS LIGHTS ON PARENTHOOD SRD
Virat Kohli : డైపర్లు మార్చడం నేర్చుకున్నాను..అది అంత కష్టమైన పని కాదు..
Photo Credit : Twitter
Virat Kohli : టీమిండియా కెప్టెన్ జనవరి 11న తండ్రైన సంగతి తెలిసిందే. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. తమ ముద్దుల కూతురికి వామిక (Vamika) అని పేరు పెట్టారు.
టీమిండియా కెప్టెన్ జనవరి 11న తండ్రైన సంగతి తెలిసిందే. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. తమ ముద్దుల కూతురికి వామిక (Vamika) అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని విరుష్క ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తమ గారాలపట్టిని ఇద్దరూ ఆప్యాయంగా చూస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. ప్రస్తుతం కోహ్లీ చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇంగ్లాండ్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి టెస్టులో ఆడుతున్నాడు. అయితే ఏళ్ల తరబడి క్రికెటర్గా ఉండటం వల్ల కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలుతున్నానని తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ వీడియోలో కోహ్లి తండ్రి అయిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన కొత్త బాధ్యతల గురించి తెలియజేశాడు. డైపర్లు మార్చడం మరీ అంత కష్టమైన పనేం కాదన్నాడు.
" ఏళ్లుగా క్రికెట్ ఆడటం వల్ల చాలా విషయాలను సులువుగా అర్థం చేసుకునే లక్షణం అబ్బింది. నేర్చుకున్న ప్రతి విషయంలో మాస్టర్ని కాకపోవచ్చు కానీ.. మేనేజ్ చేయగలను. ఇక రవీ భాయ్ వల్ల క్రీజులో, బయట అన్ని విషయాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగింది. పరిస్థితులకు అనుకూలంగా నన్ను నేను మార్చుకోగలగడం క్రికెట్ వల్ల సాధ్యమయ్యింది. ఇదే అంశం తండ్రి అయ్యాక నాకు బాగా పనికి వచ్చింది. డైపర్లు మార్చడం.. పాపను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకోవడం వంటి అంశాల గురించి ఇప్పడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసి డైపర్లు మార్చడం మరీ అంత కష్టమేం కాదు. అయితే ఈ పనిలో నేను ఇంకా మాస్టర్ని కాలేదు" అన్నాడు.
A special Test series triumph in Australia
A new chapter in life
Return of international cricket in India
ఈ సందర్భంగా కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. అతడో డైమండ్ అని, క్రికెట్లో సక్సెస్ సాధించినట్లే.. ఓ తండ్రిగానూ సాధిస్తాడని తెలిపాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.