Viral Video : వీరాభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీ...

Viral Video : క్రికెట్‌లో అభిమానానికి ఆకాశమే హద్దు. విరాభిమానుల తమ అభిమాన క్రికెటర్‌ను చూస్తే అస్సలు ఆగలేరు. అలాంటి ఘటనలు ఈమధ్య ఎక్కువవుతున్నాయి.

news18-telugu
Updated: November 17, 2019, 6:51 AM IST
Viral Video : వీరాభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీ...
వీరాభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీ... (credit - twitter)
  • Share this:
Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విదేశాల్లోనూ ఆయనంటే పడిచస్తారు అభిమానులు. పాకిస్థాన్‌లో చాలా మంది విరాట్ కోహ్లీ తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. విరాట్ కూడా అభిమానులను ఎప్పుడూ నిరాశ పరచకుండా... వాళ్లకు తన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటున్నాడు. అంత క్రేజ్ తెచ్చుకున్న కోహ్లీకి తాజాగా ఓ వింత పరిస్థితి ఎదురైంది. మధ్యప్రదేశ్... ఇండోర్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ మూడో రోజున... ఓ వీరాభిమాని... డ్రింక్స్ బ్రేక్‌లో కంచె దూకేశాడు. పరుగులు పెడుతూ మైదానంలోకి వెళ్లిపోయాడు. తన వీపుపై VK అనీ... 18 నంబర్‌ను పెయింట్ వేసుకున్న అతడు... విరాట్ కోహ్లీ కాళ్లపై పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. వెంటనే విరాట్ కోహ్లీ... ఆ అభిమాని భుజంపై చెయ్యి వేసి... అతన్ని ఏమీ అనొద్దనీ, లైట్ తీసుకోమనీ చెప్పడంతో... ఆ అభిమాని ఫుల్ ఖుషీ అయిపోయాడు.


కోహ్లీ ఇలా అభిమానిని కాపాడటంపై ఇంటర్నెట్‌లో ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తెగ మెచ్చుకుంటున్నారు.


ఇలా మైదానంలోకి చొచ్చుకుపోయే ఘటనలు ఇండియాలో ఎక్కువవుతున్నాయి. చాలా కేసుల్లో నిర్వాహకులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. క్రికెటర్లు, ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇండియా, సౌతాఫ్రికా మధ్య పుణెలో జరిగిన టెస్ట్ మూడో రోజున ఇలాగే ఓ అభిమాని సెక్యూరిటీ కవర్ దాటి వెళ్లాడు. ఆ రోజున కామెంటేటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది సరిగా పనిచేయట్లేదని, వాళ్లను పెట్టుకున్నది ఎందుకు అని ఫైర్ అయ్యాడు. ప్లేయర్లకు ఏమైనా అయితే ఎవడిది బాధ్యత అని మండిపడ్డాడు.


ప్రస్తుత సిరీస్ విషయానికొస్తే... టీమిండియా... బంగ్లాదేశ్‌ను ఓ ఇన్నింగ్స్‌తోపాటూ... 130 పరుగుల తేడాతో ఓడించి... రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా దూకుడు వల్ల మొదటి టెస్ట్ మ్యాచ్ మూడు రోజులకే ముగిసిపోయింది. రెండో టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22న కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో జరగనుండటం విశేషం.


Pics : ఆగ్రా అందాల బ్యూటీ ఆషీ సింగ్ క్యూట్ స్టిల్స్ఇవి కూడా చదవండి :

Viral Video : ఊర్వశీ? స్వప్నా?... ఎవరు బాగా డాన్స్ చేశారు?

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... ఇవీ ప్రయోజనాలు...

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు

ఈ-సిగరెట్లు తాగితే హార్ట్ ఎటాక్స్... పరిశోధనలో భయంకర వాస్తవాలు


Published by: Krishna Kumar N
First published: November 17, 2019, 6:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading