జట్టులో స్థానం కోసం సెలక్టర్లు లంచం అడిగారు...విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్...

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ విత్ సునీల్ ఛెత్రి టాక్ షోలో, కోహ్లీ తన కెరీర్ తొలినాళ్లలో రాష్ట్ర క్రికెట్ జట్టులో ఎంపిక కోసం తన తండ్రిని కొందరు సెలక్టర్లు డబ్బులు అడిగినట్లు చెప్పాడు.

news18-telugu
Updated: May 18, 2020, 6:08 PM IST
జట్టులో స్థానం కోసం సెలక్టర్లు లంచం అడిగారు...విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్...
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ విత్ సునీల్ ఛెత్రి టాక్ షోలో, కోహ్లీ తన కెరీర్ తొలినాళ్లలో రాష్ట్ర క్రికెట్ జట్టులో ఎంపిక కోసం తన తండ్రిని కొందరు సెలక్టర్లు డబ్బులు అడిగినట్లు చెప్పాడు.
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాక్ డౌన్ సమయంలో వరుసగా, టాక్ షోలలో పాల్గొంటూ అనేక సంచలన విషయాలను బయటపెడుతున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ విత్ సునీల్ ఛెత్రి టాక్ షోలో, కోహ్లీ తన కెరీర్ తొలినాళ్లలో రాష్ట్ర క్రికెట్ జట్టులో ఎంపిక కోసం తన తండ్రిని కొందరు సెలక్టర్లు డబ్బులు అడిగినట్లు చెప్పాడు. తన తండ్రి న్యాయవాదిగా మారడానికి చాలా కష్టపడ్డాడని, అయితే తాను కూడా అలాగే కష్టపడినట్లు తెలిపాడు. అలాగే తన తండ్రి ఎవ్వరూ చేయని పని చేయండి అని చెప్పినట్లు తెలిపాడు. సునీల్ చెత్రీ ఈ టాక్ షోలో కోహ్లీని చాలా ప్రశ్నలు అడిగాడు. ఒకసారి సచిన్ టెండూల్కర్ పాడిల్ స్కూప్ను దొంగిలించాలనుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. అలాగే చివరి బంతికి మూడు పరుగులు అవసరమైతే, వకార్ యూనస్ మరియు షేన్ వార్న్ లలో ఎవరిని ఎన్నుకుంటారని సునీల్ ఛెత్రి అడగగా. కోహ్లీ యూనస్ పేరు తీసుకున్నాడు. యూనస్ బంతిని కొడతాడనే నమ్మకం ఉందని చెప్పాడు.

విరాట్ కోహ్లీ సునీల్ ఛెత్రికి తన చిన్ననాటి సంఘటన చెప్పాడు. తాను చిన్నతనంలో వివాహాలలో నోట్లను విసురుతూ చాలా ఆనందించేవాడినని. ఒక రోజు తమ ఇంట్లో సరుకులను తీసుకురావడానికి తనకు యాభై రూపాయల నోటు ఇచ్చారని అయితే దారిలో ఓ పెళ్లి ఊరేగింపు వెళుతుంటే తనకు ఏమి జరిగిందో తెలియలేదని, వెంటనే తాను నోటును విసిరేసి డాన్స్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళితే , నేను ఆ నోటు కట్ చేసి పేల్చి డ్యాన్స్ చేసాను. ఆ తర్వాత ఇంట్లో చివాట్లు తిన్నట్లు తెలిపాడు
First published: May 18, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading