మాకేం సంబంధం లేదు-హార్దిక్,రాహుల్ కామెంట్స్‌పై కొహ్లీ

ఆటగాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలకు ...భారత జట్టుకు ఎటువంటి సంబంధం లేదన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ. 'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్‌పై విరాట్ తొలిసారిగా స్పందించాడు.

news18-telugu
Updated: January 11, 2019, 1:52 PM IST
మాకేం సంబంధం లేదు-హార్దిక్,రాహుల్ కామెంట్స్‌పై కొహ్లీ
హార్దిక్ పాండ్య,రాహుల్, విరాట్ కొహ్లీ ( Hardik pandya/ BCCI instagram)
news18-telugu
Updated: January 11, 2019, 1:52 PM IST
'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ చేసిన అభ్యంతరకర కామెంట్స్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ స్పందించాడు." ఆటగాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలకు ...భారత జట్టుకు ఎటువంటి సంబంధం లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురుచూస్తున్నాం..." అని అన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. " దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాధ్యత కలిగిన ఆటగాళ్లుగా వారు చేసిన వ్యాఖ్యలను జట్టు సమర్ధించదు. బీసిసిఐ ఏ నిర్ణయం తీసుకున్నా, మా ఆట తీరులో తేడా ఉండదు. నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే నేను స్పందించగలను.."అన్నాడు. ఇప్పటికే పాండ్య,రాహుల్ తాము చేసిన తప్పు తెలుకునే ఉంటారని అభిప్రాయపడ్డాడు.

హిందీ పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్...వారిని తీవ్ర ఇబ్బందుల్లో పడేశాయి. ఈ ‘టాక్ షో’ రచ్చ ఎంతవరకూ వెళ్లిందంటే... ‘అక్కడ అలా ఎందుకు మాట్లాడారు... మాకు 24 గంటల్లో వివరణ ఇవ్వాలి...’ అంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షోకాజ్ నోటీసులు ఇచ్చేదాకా! తాజాగా పాండ్యా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ సీఓఏ (కమిటీ ఆడ్మినిస్టేటర్ చీఫ్) వినోద్ రాయ్... ఇద్దరికీ రెండు వన్డేల నుంచి తప్పించాలని సూచించారు.

బీసీసీఐ లీగల్ సెల్‌కు ఈ వివాదాన్ని మళ్లిచ్చిన వినోద్ రాయ్... ‘హార్ధిక్ పాండ్యా ఇచ్చిన వివరణ నాకు సంతృప్తినివ్వలేదు. అందుకే ఇద్దరికీ రెండు వన్డేల నుంచి తప్పిస్తే తిక్క కుదురుతుంది. సీఓఏ డయానా ఎడుల్జీకే ఫైనల్ డిసిషన్ తీసుకునే అధికారాన్ని ఇచ్చేశాం. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి...’ అన్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే... కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహారించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో సహచరుడు కెఎల్ రాహుల్‌తో కలిసి పాల్గొన్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య. కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ... ‘మా ఇంట్లోవాళ్లతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సెక్స్‌కు సంబంధించిన విషయాలు కూడా చెబుతుంటా. అమ్మాయిలతో ఎంజాయ్ చేసినప్పుడు కూడా వారి దగ్గర ఆ విషయాలు దాచను. నేను ఫస్ట్ టైమ్ సెక్స్ చేసిన సందర్భం కూడా చెప్పాను...’ అంటూ వ్యాఖ్యానించిన హార్ధిక్ పాండ్యా... ‘అమ్మాయిల బ్యాక్ నాకెంతో సెక్సీగా అనిపిస్తుంది. వాళ్ల బ్యాక్ అందాలు చూసేందుకే నేను వెనక నడుస్తూ ఉంటా...’ అంటూ రెచ్చిపోయే వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు పురుషాహంకారం స్పష్టంగా కనిపించేలా... ‘అది, ఇది, దాన్ని’ అంటూ ఉచ్ఛరిస్తూ మాట్లాడాడు హార్ధిక్ పాండ్యా. దాంతో మహిళా సంఘాల పాటు క్రికెట్ అభిమానులు మనోడి వైఖరిని కామెంట్లతో చీల్చి చెండాడేస్తున్నారు. దాంతో స్పందించిన హార్ధిక్ పాండ్యా... ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు.Hardik Pandya, KL Rahul Face Two-ODI Ban for 'Sexist' Remarks on Koffee With Karan పాండ్యా, రాహుల్‌లను రెండు వన్డేల నుంచి తప్పించండి... బీసీసీఐకి వినోద్ రాయ్ సూచన
హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ (Photo: twitter)


‘కాఫీ విత్ కరణ్’ షోలో నేను మాట్లాడిన మాటలు ఎవ్వరినైనా బాధపెట్టిఉంటే నన్ను క్షమించండి... నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు. కొంచెం అతి చేశాను...’ అంటూ పేర్కొన్నాడు హార్ధిక్ పాండ్యా. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యాను, అతనితో పాటు టీవీ కార్యక్రమంలో పాల్గొన్న కెఎల్ రాహుల్‌ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు పంపించింది బీసీసీఐ. 24 గంటల్లో అలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వాలని కోరింది. ఇదే షోలో... ‘సచిన్ టెండుల్కర్ కంటే విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మెన్’ అంటూ ఈ ఇద్దరూ చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...