యోగిలా మారిన కొహ్లీ.. షర్ట్ లేకుండా పోజులు.. నెటిజన్ల జోకులు

ఇప్పుడా ఫొటోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతూ ఆటాడుకుంటున్నారు. ఆ ఫొటోను కొత్త ట్రాఫిక్ రూల్స్‌ని లింక్ చేసి ఉతికారేస్తున్నారు.

news18-telugu
Updated: September 5, 2019, 9:57 PM IST
యోగిలా మారిన కొహ్లీ.. షర్ట్ లేకుండా పోజులు.. నెటిజన్ల జోకులు
విరాట్ కొహ్లీ
  • Share this:
టీమిండియా కెప్టెన్ కొహ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఆఫ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడూ తాను చేసే పనులను అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఇటీవల కొహ్లీ పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. షర్ట్ లేకుండా కేవలం షార్ట్స్‌పైనే ఉన్న కొహ్లీ యోగిలా మారిపోయాడు. అంతేకాదు తత్వవేత్తలా ఓ సూక్తి కూడా చెప్పాడు. 'మన అంతరంగంలోకి మనం చూసుకున్నంత కాలం.. బయటి దేని గురించి మనం వెతకవలసిన అవసరం లేదు' అని ట్వీట్ చేశాడు కొహ్లీ. ఇప్పుడా ఫొటోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతూ ఆటాడుకుంటున్నారు. ఆ ఫొటోను కొత్త ట్రాఫిక్ రూల్స్‌ని లింక్ చేసి ఉతికారేస్తున్నారు.

ప్రపంచంలోనే ఖరీదైన ఆటగాడు ట్రాఫిక్ చలాన్లు కట్టి ఇలా తయారయ్యాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. విరాట్ కొహ్లీ పీకే సీక్వెల్‌లో నటిస్తున్నారని ఓ నెటిజన్ సరదగా వ్యాఖ్యానించాడు. నేను బట్టలు తీసుకొస్తున్నాను అని అనుష్క శర్మ అంటున్నట్లుగా ఓ నెటిజన్ల మీమ్ క్రియేట్ చేశాడు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>